News July 20, 2024

సింహాచలం: రేపు దిల్లీ విజయోత్సవం

image

ఆషాడ పౌర్ణమి సందర్భంగా ఈనెల 21న అప్పన్న ఆలయంలో దిల్లీ విజయోత్సవం నిర్వహించనున్నారు. భగవత్ రామానుజులు దిల్లీ బాదుషాను పాండిత్యంలో మెప్పించిన సందర్భాన్ని పురస్కరించుకొని ఈ ఉత్సవాన్ని జరపడం ఆలయ సంప్రదాయంగా వస్తుంది. ఆదివారం సాయంత్రం నాలుగు గంటలకు భక్తుల దర్శనాలను నిలిపివేసి ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తామని ఆలయ అధికారులు తెలిపారు.

Similar News

News December 1, 2025

విశాఖ జిల్లాలోని స్కూళ్లలో పిల్లలకు ఉదయం స్నాక్స్

image

జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు వారంలో మూడు రోజుల మార్నింగ్ న్యూట్రిషన్ అందించేందుకు కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ అక్షయపాత్ర సహకారంతో కార్యక్రమాన్ని సోమవారం ప్రారంభించారు. తొలి విడతగా 178 పాఠశాలల్లో ప్రారంభించి, త్వరలో అన్ని పాఠశాలలకు విస్తరించనున్నారు. ఉదయం అల్పాహారం లేక తరగతులకు వచ్చే పిల్లలకు చిరుతిండ్లు వంటివి అందించనున్నారు.

News December 1, 2025

అర్జీలు రీ-ఓపెన్ కాకూడదు: అధికారులకు కలెక్టర్ ఆదేశం

image

విశాఖ కలెక్టరేట్‌లో కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ పీజీఆర్ఎస్ నిర్వహించారు. ప్రజల నుంచి నేరుగా 237 వినతులు స్వీకరించారు. ఒకే సమస్యపై అర్జీలు మళ్లీ ‘రీ-ఓపెన్’ కాకుండా నాణ్యమైన పరిష్కారం చూపాలని అధికారులను ఆదేశించారు. ఫిర్యాదుదారులతో తప్పనిసరిగా ఫోన్లో మాట్లాడాలని సూచించారు. వచ్చిన వినతుల్లో రెవెన్యూ, జీవీఎంసీ సమస్యలే ఎక్కువగా ఉన్నాయని, వాటిని తక్షణమే పరిష్కరించాలని ఆయన స్పష్టం చేశారు.

News December 1, 2025

స్టీల్ ప్లాంట్ ఘటనపై విచారణకు ఏఐటీయూసీ డిమాండ్

image

విశాఖ స్టీల్ ప్లాంట్ కన్వేయర్ బెల్ట్ ఘటనపై సీఎండీని విధుల నుంచి దూరంగా ఉంచి, నిపుణులతో జాయింట్ విచారణ జరిపించాలని ఏఐటీయూసీ నేతలు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. యాజమాన్యం లోపం వల్లే బెల్టు తెగిందని, ఉద్యోగులపై నిందలు వేయడం తగదని జిల్లా కార్యదర్శి జి.ఎస్.జె.అచ్యుత రావు మండిపడ్డారు. తప్పుడు మరమ్మతుల వల్లే ప్రమాదం జరిగిందని, దీనిపై సమగ్ర విచారణ జరపాలని వారు డిమాండ్ చేశారు.