News July 20, 2024
సింహాచలం: రేపు దిల్లీ విజయోత్సవం
ఆషాడ పౌర్ణమి సందర్భంగా ఈనెల 21న అప్పన్న ఆలయంలో దిల్లీ విజయోత్సవం నిర్వహించనున్నారు. భగవత్ రామానుజులు దిల్లీ బాదుషాను పాండిత్యంలో మెప్పించిన సందర్భాన్ని పురస్కరించుకొని ఈ ఉత్సవాన్ని జరపడం ఆలయ సంప్రదాయంగా వస్తుంది. ఆదివారం సాయంత్రం నాలుగు గంటలకు భక్తుల దర్శనాలను నిలిపివేసి ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తామని ఆలయ అధికారులు తెలిపారు.
Similar News
News October 11, 2024
మంత్రి లోకేశ్‌ను కలిసిన ఎమ్మెల్యే గంటా
విశాఖపట్నంలో అతిపెద్ద ఐటీ కంపెనీ టీసీఎస్ రావడానికి మంత్రి లోకేశ్ కృషి చేశారని ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు. శుక్రవారం ఆయన్ను కలిసి పలు విషయాలపై చర్చించారు. ఈ కంపెనీ ద్వారా పదివేల మందికి ఉపాధి అవకాశం దొరుకుతుందని, విద్యా, ఫార్మా, టూరిజం వంటి అభివృద్ధి చెందుతాయన్నారు. నగరంలో మెట్రో ఏర్పడే సమయాని ఫ్లైఓవర్లు, కారిడార్లు వంటి వాటిపై దృష్టి సారించాలని మంత్రిని గంటా కోరారు.
News October 11, 2024
అప్పుడే విశాఖ ఉక్కుకు మంచి రోజులు: గుడివాడ
స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ డిమాండ్ చేశారు. శుక్రవారం ఆయన విశాఖలో మీడియాతో మాట్లాడారు. టీడీపీ మద్దతుతో కేంద్ర ప్రభుత్వం మనుగడ సాగిస్తోందని గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరించవద్దని అల్టిమేటం ఇవ్వాలని కోరారు. అప్పుడే విశాఖ ఉక్కుకు మంచి రోజులు వస్తాయని అన్నారు.
News October 11, 2024
భీమిలిలో మానసిక రోగిపై అత్యాచారం..!
భీమిలికి చెందిన ఓ మానసిక రోగిపై ఈనెల 3న అత్యాచారం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తల్లిదండ్రులు లేని సమయంలో మతిస్థిమితం లేని అమ్మాయిని ఓ యువకుడు స్కూటీపై గొట్లాం తీసుకువెళ్లి అత్యాచారం చేసి వదిలేశాడు. స్కూటీని ఆమెను స్థానికులు గమనించి విజయనగరం పోలీసులకు ఫిర్యాదు చేయగా.. వారు భీమిలి పోలీసులకు అప్పగించారు. విచారణ అనంతరం కేసును మహిళా పోలీస్ స్టేషన్‌కు బదిలీ చేశారు.