News March 24, 2024
సింహాచలం: సింహాద్రి అప్పన్నకు రేపు పెళ్లి చూపులు
సింహాచలం సింహాద్రి అప్పన్నకు ఈనెల 25వ తేదీన పెళ్లిచూపులు జరగనున్నాయి. స్వామిని పెళ్లి కుమారుడిగా ముస్తాబు చేసి కొండ దిగువన గల పుష్కరిణి సత్రంలోని ఉద్యానవన మండపానికి తీసుకువస్తారు. అక్కడ మండపంలో అధిష్ఠింప చేస్తారు. పెళ్లి నిశ్చయం అయినందున స్వామిని ఊరేగింపుగా అడవివరంలో వేంచేసి ఉన్న పైడితల్లమ్మ ఆలయానికి ఊరేగింపుగా తీసుకువెళ్తారు. అనంతరం మళ్లీ ఇక్కడకు తీసుకువచ్చి డోలోత్సవం, వసంతోత్సవం నిర్వహిస్తారు.
Similar News
News September 20, 2024
విశాఖ-దుర్గ్ వందేభారత్ ఛార్జీలు ఇవే
కొత్తగా ప్రారంభమైన విశాఖ-దుర్గ్ వందే భారత్ రైలు ఛార్జీలు గుండె గుబేల్ మంటున్నాయి. శుక్రవారం నుంచి ఈ రైలు రెగ్యులర్‌గా తిరుగుతోంది. విజయనగరం నుంచి రాయగడ ఛైర్ కార్ ధర రూ.535, పార్వతీపురానికి రూ.490గా ధర ఉంది. ఎగ్జిక్యూటివ్ ఛైర్ ధర అయితే దీనికి రెట్టింపు ఉంది. ఇదే ఎక్స్‌ప్రెస్ ట్రైన్ స్లీపర్ క్లాస్ విజయనగరం నుంచి పార్వతీపురం ధర కేవలం రూ.145 మాత్రమే. వందే భారత్ ధరలు చూసి ప్రయాణీకులు హడలిపోతున్నారు.
News September 20, 2024
ప్రారంభమైన దుర్గ్ – విశాఖ వందే భారత్
నూతనంగా ఇటీవల ప్రారంభించిన విశాఖ – దుర్గ్ వందే భారత్ ట్రైన్ దుర్గ్ నుంచి శుక్రవారం ఉదయం 5.45 నిమిషాలకు బయలుదేరి పార్వతీపురం 11:38 నిమిషాలకు చేరుకుంది. ఈ ట్రైన్ వారంలో గురువారం మినహా మిగిలిన అన్ని రోజులు ఉంటుందని రైల్వే అధికారులు తెలిపారు. బొబ్బిలిలో నిలుపుదలకు స్థానిక MLA అడిగినప్పటికీ ఇంకా ఎటువంటి సమాచారం లేదు. ఈ ట్రైన్ తిరిగి విశాఖలో మధ్యాహ్నం 2:50 నిమిషాలకు దుర్గ్ బయలుదేరనుంది.
News September 20, 2024
‘విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన’
విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు అక్టోబర్ 1 నుంచి 3వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఛైర్మన్ ఆదినారాయణ అన్నారు. ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కార్మికులు చేపట్టిన రిలే నిరాహార దీక్ష శిబిరంలో ఆయన పాల్గొన్నారు. రాజకీయాలకు, ప్రాంతాలకు అతీతంగా చేపడుతున్న ఈ ఉద్యమానికి అందరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు.