News July 11, 2024
సింహాద్రిపురంలో అత్యధిక వర్షపాతం నమోదు

జిల్లా వ్యాప్తంగా గురువారం ఉదయం వరకు కురిసిన వర్షానికి సింహాద్రిపురం మండల పరిధిలో అత్యధిక వర్షపాతం నమోదయింది. సింహాద్రిపురం మండలంలో 13.8 మిల్లీ మీటర్లు వర్షపాతం నమోదు కాగా, యర్రగుంట్లలో 6.8 మి. మీ., కడపలో 6.2 మి.మీ., చింతకొమ్మదిన్నె పరిధిలో 5.4 మి.మీ., ఖాజీపేటలో 3.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. జిల్లా వ్యాప్తంగా 64.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కాగా, జిల్లా సరాసరి 1.8 మి.మీ.,గా నమోదైంది.
Similar News
News February 15, 2025
జిల్లాను స్వచ్ఛతకు ప్రతీకలుగా తీర్చిదిద్దాలి: కడప కలెక్టర్

స్వర్ణాంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర సాధనలో భాగంగా జిల్లాలోని గ్రామాలు, పట్టణాలను స్వచ్ఛతకు ప్రతీకలుగా తీర్చిదిద్దాలని కడప జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో ప్రతి నెలా 3వ శనివారం చేపట్టే “స్వచ్ఛ దివస్” కార్యాచరణపై వీసి ద్వారా పలు సూచనలు, ఆదేశాలు జారీ చేశారు. అన్ని గ్రామాలు, పట్టణాల్లోని వీధుల్లో, ఇళ్లలో “స్వచ్ఛ దివస్” కార్యక్రమాన్ని విధిగా, బాధ్యతగా నిర్వహించాలన్నారు.
News February 15, 2025
కడప జిల్లాకు ‘నీతీ ఆయోగ్’ అత్యుత్తమ పురస్కారం

కడప జిల్లాకు నీతి ఆయోగ్ అత్యుత్తమ పురస్కారం లభించింది. ఆకాంక్షిత జిల్లాలలో అత్యుత్తమ పనితీరును కనబరిచినందుకు కడప జిల్లాకు కేంద్ర ప్రభుత్వం “నీతీ ఆయోగ్” ద్వారా అత్యుత్తమ పురస్కారంతో రూ. 3 కోట్లను కేటాయించిందని కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి శుక్రవారం తెలిపారు. జిల్లాలో ఆర్థిక పరిపుష్టి, నైపుణ్య అభివృద్ధి అనే అంశాల్లో ఉత్తమ పనితీరు కనబరిచినందుకు ఈ పురస్కారం ఇచ్చినట్లు పేర్కొన్నారు.
News February 14, 2025
ఇంటర్ పరీక్షలు ప్రశాంతంగా నిర్వహించాలి: కలెక్టర్

కడప జిల్లాలో ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ డా.శ్రీధర్ చెరుకూరి అధికారులను ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయంలో ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణ సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. మార్చి 1వ తేదీ నుంచి మార్చి 20వ తేదీ వరకు పబ్లిక్ థియరీ పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు.