News March 30, 2024
సింహాద్రి అప్పన్నను దర్శించుకున్న కలెక్టర్

విశాఖ జిల్లా కలెక్టర్ మల్లికార్జున కుటుంబ సభ్యులతో కలిసి సింహాచలం ఆలయాన్ని సందర్శించారు. ఆలయంలో జరుగుతున్న సుదర్శన నారసింహ మహా యజ్ఞం కార్యక్రమాన్ని తిలకించారు. అప్పన్న బాబును దర్శించుకుని విశేష పూజలు అర్చనలు నిర్వహించారు. అనంతరం కలెక్టర్ దంపతులు యజ్ఞ ప్రసాదాన్ని స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్య నిర్వహణ అధికారి శ్రీనివాసమూర్తి పాల్గొన్నారు.
Similar News
News November 22, 2025
కంచరపాలెం రైతుబజారుకు ‘బాహుబలి’ క్యారెట్

కంచరపాలెం రైతు బజార్కు 880 గ్రాములు క్యారేట్ను ఓ మహిళ రైతు తీసుకొచ్చింది. ఈ క్యారేట్ను వినియోగదారులు, ప్రజలు అందరూ వింతగా చూస్తూ వారి సెల్ ఫోన్లో ఫోటోలు తీసుకున్నారు. అయితే రైతు బజార్లో కేజీ క్యారెట్ రూ.60 ఉండడంతో ఈ ఒక్క క్యారెట్ రూ.53 ధర పలికింది. అయితే గతంలో చాలాసార్లు కాయగూరలు ఇటువంటి పరిమాణంలో రావడం జరిగిందని అధికారులు తెలిపారు.
News November 22, 2025
విశాఖ: పసికందు హత్య కేసులో వీడని మిస్టరీ

తాటిచెట్లపాలెంలో పసికందును క్రూరంగా హత్య చేసి శరీర భాగాలను వేరు చేసి కాల్వలో పడేసిన విషయం పాఠకులకు విధితమే. కాగా ఇప్పటివరకు దీనికి సంబంధించి ఎటువంటి కీలక ఆధారాలు లభించలేదు. అంతేకాకుండా మృతురాలి తలభాగం కూడా ఇప్పటిదాకా లభ్యం కాలేదు. కొండపై ఎవరైనా అనుమానితులు సంచరిస్తున్నార అన్న అనుమానంతో డ్రోన్లతో నిఘా పెట్టారు. ఆరోజు రాత్రి నుంచి వేకువజాము వరకు ఆ రోడ్డులో ప్రయాణించిన వారిని విచారిస్తున్నారు.
News November 22, 2025
వేట నిషేధ సమయంలో రూ.20 వేల సాయం: గంటా

బతుకు తెరువు కోసం ప్రాణాలను పణంగా పెట్టి సముద్రంలో వేటకు వెళ్లే మత్స్యకారులకు ప్రభుత్వం ఆసరాగా ఉంటుందని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు. ప్రపంచ మత్స్య దినోత్సవం సందర్భంగా చేపల తిమ్మాపురంలో శుక్రవారం ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. వేట నిషేధ సమయంలో మత్స్యకారుల ఉపాధికి ఇబ్బంది కలుగకుండా ఏడాదికి రూ.20 వేల చొప్పున 12,130 మందికి రూ.25 కోట్ల సాయాన్ని అందించామని తెలిపారు.


