News September 24, 2024
సింహాద్రి అప్పన్న ఆలయంలో సంప్రోక్షణ

తిరుపతి వెంకటేశ్వర స్వామి లడ్డు ప్రసాదంలో జంతువుల కొవ్వును వినియోగించి తీవ్ర అపచారం చేశారని ఎమ్మెల్యేలు గంటా శ్రీనివాసరావు, గణబాబు, పంచకర్ల రమేశ్ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. దానికి ప్రాయశ్చిత్తంగా సింహాచలం సింహాద్రి అప్పన్న ఆలయంలో సంప్రోక్షణ నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో వారు పాల్గొని సింహాద్రి అప్పన్నకు విశేష పూజలు, యాగాలు చేశారు.
Similar News
News December 27, 2025
విశాఖలో ఒక రోజు ముందే పింఛన్ల పంపిణీ

నూతన సంవత్సరం సందర్భంగా జనవరి 1న ఇవ్వాల్సిన సామాజిక భద్రతా పింఛన్లను డిసెంబర్ 31న ముందుగానే పంపిణీ చేయనున్నట్లు కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ తెలిపారు. ఆ రోజు గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పింఛన్లు అందజేస్తారని చెప్పారు. పంపిణీ సజావుగా జరిగేందుకు డిసెంబర్ 30న నగదు డ్రా చేసేందుకు ఆదేశించినట్లు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.
News December 27, 2025
జనవరి 15 నుంచి అన్ని సేవలు ఆన్లైన్లోనే: విశాఖ కలెక్టర్

విశాఖ జిల్లాలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఇకపై ప్రతి ఫైల్ను ఈ-ఆఫీస్ విధానంలోనే నిర్వహించాలని కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ ఆదేశించారు. ఫిజికల్ ఫైళ్లకు స్వస్తి పలికి, జనవరి 15 నుంచి ప్రభుత్వ సేవలను పూర్తిగా ఆన్లైన్లోనే అందించాలని స్పష్టం చేశారు. ‘మనమిత్ర’ వాట్సాప్ గవర్నెన్స్ (95523 00009)పై ప్రజల్లో అవగాహన కల్పించాలని, సిబ్బంది తప్పనిసరిగా బయోమెట్రిక్ హాజరు వేయాలని అధికారులకు సూచించారు.
News December 26, 2025
విశాఖలో స్మార్ట్ స్ట్రీట్ వెండింగ్ మార్కెట్ పథకం

విశాఖలో రూ.1,425 కోట్లతో స్మార్ట్ స్ట్రీట్ వెండింగ్ మార్కెట్ పథకాన్ని ప్రభుత్వం అమలు చేయనుంది. GVMC ఆధ్వర్యంలో నగరంలోని మధురవాడ, ఆర్ఆర్ సెంటర్, గాజువాక, కూర్మన్నపాలెం, దువ్వాడ ఫ్లైఓవర్ కింద, సూర్యబాగ్ సెంట్రల్ పార్క్ ప్రాంతాల్లో తొలి దశలో 250 వ్యాపార యూనిట్లు ఏర్పాటు చేయనున్నారు.ట్రాఫిక్ సమస్యలు తగ్గించడం, నగర సుందరీకరణ, వీధి వ్యాపారుల జీవనోపాధి భద్రతే ఈ పథకం ప్రధాన లక్ష్యమని అధికారులు తెలిపారు.


