News December 10, 2024
సింహాద్రి అప్పన్న హుండీ ఆదాయం రూ.2.81కోట్లు

సింహాద్రి అప్పన్నకు భక్తులు హుండీల ద్వారా సమర్పించిన కానుకలు 39 రోజులకు గాను ఆలయ అధికారులు ఈఓ త్రినాథ్ రావు పర్యవేక్షణలో సోమవారం లెక్కించారు. మొత్తం రూ.2,81,93,913 ఆదాయం వచ్చింది. బంగారం 126 గ్రాముల 300 మిల్లీగ్రాములు, వెండి 15 కిలోల 140 గ్రాములు, 9దేశాల విదేశీ కరెన్సీ నోట్లు వచ్చినట్లు తెలిపారు. ఈ లెక్కింపు కార్యక్రమంలో ఆలయ అధికారులు, సిబ్బంది, సేవా సంఘాల సభ్యులు పాల్గొన్నారు.
Similar News
News November 6, 2025
సమన్వయంతో అధికారులు పనులు పూర్తి చేయాలి: మేయర్

విశాఖలో ఈనెల 14, 15వ తేదీల్లో భాగస్వామ్య సదస్సు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో నగరమంతా సుందరీకరణ పనులు పూర్తి చేయాలని ఇంజినీరింగ్ అధికారులకు మేయర్ పీలా శ్రీనివాసరావు ఆదేశించారు. ఇంజినీరింగ్ అధికారులతో బుధవారం ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఇప్పటివరకు జరిగిన అభివృద్ధి పనులు, చేపట్టవలసిన అంశాలు అడిగి తెలుసుకున్నారు.
News November 6, 2025
విశాఖలో ప్రశాంతంగా ముగిసిన కార్తీక పౌర్ణమి వేడుకలు

కార్తీక పౌర్ణమి సందర్భంగా విశాఖ బీచ్‌ల వద్ద వేలాదిమంది భక్తులు సముద్ర స్నానం చేశారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని డీఐజీ గోపినాథ్ ఆధ్వర్యంలో అధికారులు పకడ్బందీగా భద్రతా ఏర్పాట్లు చేశారు. ప్రజల సహకారంతో పాటు రెవెన్యూ, మత్స్య, వైద్య, స్థానిక సంస్థలు, స్వచ్ఛంద సంస్థల సమన్వయంతో కార్యక్రమం ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా ప్రశాంతంగా ముగిసిందని తెలిపారు.
News November 6, 2025
విశాఖ: 17 నుంచి 30వ తేదీ వరకు కుష్టు వ్యాధి గుర్తింపు సర్వే

శరీరంపై స్పర్శ లేని మచ్చలు ఉంటే వైద్య సిబ్బందికి తెలియజేయాలని కలెక్టర్ ఎం.ఎన్.హరేందిర ప్రసాద్ బుధవారం విజ్ఞప్తి చేశారు. విశాఖలో నవంబర్ 17 నుంచి 30 వరకు కుష్టు వ్యాధి గుర్తింపు కార్యక్రమం (LCDC) పటిష్టంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. ఆశా కార్యకర్తలు, వాలంటీర్లు ఇంటింటికి వెళ్లి సర్వే నిర్వహిస్తారని, ప్రాథమిక దశలో గుర్తిస్తే అంగవైకల్యం రాకుండా నివారించవచ్చు అన్నారు.


