News April 7, 2024
సికింద్రాబాద్‌లో నేనే గెలుస్తా: కిషన్ రెడ్డి
లోక్‌సభ ఎన్నికల్లో సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానాన్ని భారీ మెజారిటీతో బీజేపీ కైవసం చేసుకుంటుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి జి.కిషన్ రెడ్డి అన్నారు. ఆదివారం HYD బర్కత్‌పురలోని బీజేపీ నగర కార్యాలయంలో ఎన్నికల ఇన్‌ఛార్జ్ అభయ్ పాటిల్ అధ్యక్షతన సికింద్రాబాద్ పార్లమెంట్ ఎన్నికల నిర్వహణ కమిటీ సమావేశం జరిగింది. ప్రజలంతా బీజేపీకి ఓటు వేసి తనను గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నారని ఆయన తెలిపారు.
Similar News
News November 13, 2024
HYD: ప్రజా కవికి 1992లోనే పద్మవిభూషణ్: KTR
ప్రజాకవి కాళోజి నారాయణరావు వర్ధంతి సందర్భంగా తెలంగాణ భవన్‌లో ఆయన చిత్రపటానికి మాజీ మంత్రి, BRS వర్కింగ్ ప్రెసిడెంట్, MLA KTR నివాళులర్పించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. 1992లో భారతదేశ రెండో అత్యున్నత పౌర పురస్కారం పద్మవిభూషణ్‌ను పొందారని కొనియాడారు. కార్యక్రమంలో మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు తదితరులు పాల్గొన్నారు.
News November 13, 2024
మాజీ MLA పట్నం నరేందర్ అరెస్ట్ దుర్మార్గం: హరీశ్ రావు
మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని అక్రమ అరెస్టు చేయడం దుర్మార్గమని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. పాలన గాలికి వదిలి అరెస్టులు, అక్రమ కేసులు, ముందస్తు నిర్బంధాలు విధిస్తూ రాజకీయ కక్ష తీర్చుకోవడం సిగ్గుచేటన్నారు. కాంగ్రెస్ బెదిరింపులకు బీఆర్ఎస్ పార్టీ భయపడదన్నారు. పట్నం నరేందర్ రెడ్డిని, రైతులను వెంటనే విడుదల చేయాలని హరీశ్ రావు డిమాండ్ చేశారు.
News November 13, 2024
యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్‌లో ఉద్యోగాలు
గచ్చిబౌలిలోని యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ (UoH) ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేసింది. అర్హతగల భారతీయ పౌరులు, భారతీయ విదేశీ పౌరులు అప్లై చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు. చివరి తేదీ 9 డిసెంబర్ 2024. అప్లై చేసిన హార్డ్ కాపీ డిసెంబర్ 16 లోపు పంపించాలి. మరిన్ని వివరాలకు https://uohyd.ac.in/careers-uoh/ సందర్శించవచ్చు. SHARE IT