News March 16, 2025

సికింద్రాబాద్: అగ్నివీర్ దరఖాస్తులు.. కీలక సూచన

image

భారత సైన్యంలో సేవలందించేందుకు అగ్ని వీర్ పోస్టులకు దరఖాస్తు చేయడానికి ఏప్రిల్ 10 ఆఖరు తేది. ఎంపిక ప్రక్రియకు సంబంధించి అభ్యర్థులకు చాలా అనుమానాలు ఉన్నాయి. వాటిని నివృత్తి చేసుకునేందుకు అభ్యర్థులు సికింద్రాబాద్‌లోని ఆర్మీ రిక్రూటింగ్ కార్యాలయానికి (040 27740059)కాల్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు. SHARE IT

Similar News

News November 15, 2025

సూర్యాపేట: ఆర్ఎంపీల కమీషన్ దందా..!

image

సూర్యాపేట జిల్లాలో ఆర్ఎంపీల కమీషన్ దందా నడుస్తోంది. ఎక్కువ కమీషన్ ఇచ్చే ప్రైవేటు ఆసుపత్రులకు ఆర్ఎంపీలు రోగులను రిఫర్ చేస్తున్నారు. జిల్లా కేంద్రంలోని ఆస్పత్రులు ప్రతి కేసుకూ ఆర్ఎంపీలకు భారీగా కమీషన్లు ఇస్తున్నట్లు సమాచారం. ఈ కారణంగానే రోగులు అధిక ఖర్చుల భారాన్ని మోయాల్సి వస్తోంది. అధికారులు తక్షణమే స్పందించి, ఈ అక్రమ దందాను అరికట్టాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

News November 15, 2025

NRPT: గుర్తుతెలియని మృతదేహం లభ్యం

image

నారాయణపేట మండలంలోని గడ్డమీద అప్పంపల్లి వద్ద గుర్తు తెలియని మృతదేహం శనివారం లభ్యం అయింది. స్థానికుల సమాచారంతో అక్కడికి చేరుకున్న పోలీసులు, పూర్తిగా కుళ్లిపోయి గుర్తుపట్టలేని స్థితిలో ఉన్న మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఇది హత్యా లేక ఆత్మహత్యా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

News November 15, 2025

ఇక గాంధీ భవన్ చూపు.. గ్రేటర్ HYD వైపు..!

image

కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జూబ్లీహిల్స్‌లో ఘన విజయం సాధించడంతో ఆ పార్టీ శ్రేణులు సంబురాలు చేసుకుంటున్నాయి. ఈ టెంపోను ఇలాగే కొనసాగించాలని అధిష్ఠానం భావిస్తోంది. అందుకే ఈ విజయం స్ఫూర్తితో జీహెచ్ఎంసీలో పాగా వేయాలని గాంధీభవన్ ప్లాన్ వేస్తోంది. ఈ మేరకు నాయకులు కేడర్‌కు దిశానిర్దేశం చేయనుంది. గ్రేటర్ HYDలో పక్కాగా ప్లాన్ వేసి వందకు తగ్గకుండా కార్పొరేటర్ సీట్లు సాధించి మేయర్ సీటు పట్టాలని ఆశిస్తోంది.