News May 19, 2024

సికింద్రాబాద్: అగ్ని వీర్ ట్రైనింగ్ ప్రమాణాలపై తనిఖీ

image

సికింద్రాబాద్‌లో కొనసాగుతున్న అగ్నివీర్ శిక్షణ ప్రమాణాలపై లెఫ్ట్ నుంచి జనరల్ మంజిత్ కుమార్ తనిఖీ చేశారు. ఇందులో భాగంగా శిక్షణ కేంద్రం వద్ద ఉన్న అధికారులను కలిసి అక్కడ ఉన్న పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. అగ్నివీర్లు అద్భుతంగా రాణించేందుకు అత్యుత్తమ ప్రమాణాలు పాటించి శిక్షణ అందించాలని వారు ఆదేశించారు.

Similar News

News December 3, 2024

HYD: ఈ మెసేజ్ క్లిక్ చేస్తే DP ఛేంజ్: పోలీసులు

image

వాట్సాప్ గ్రూపుల్లో యూనియన్ బ్యాంక్ నుంచి రూ.5,899 రివార్డు పాయింట్లు వస్తాయనే ఓ మెసేజ్ వచ్చిందా..? జాగ్రత్తగా ఉండాలని రాచకొండ పోలీసులు సూచించారు. ‘సోషల్ మీడియాలో APK ఫైల్ యాప్ పంపిస్తున్నారు. క్లిక్ చేస్తే వాట్సాప్ ప్రొఫైల్ యూనియన్ బ్యాంక్ ఫొటోగా మారుతుంది. తర్వాత ఎడిట్ కూడా కావడం లేదు. దీనిపై జాగ్రత్త..!’ అని పోలీసులు సూచించారు. SHARE IT

News December 3, 2024

HYD: పాములు పట్టుకునే వారికోసం కాల్ చేయండి!

image

నగరంలో పలుచోట్ల పాములు కనిపించినప్పుడు ఎవరికి చెప్పాలో తెలియక ప్రజలు భయాందోళనకు గురవుతుంటారు. అలాంటి వారికి వెటర్నరీ అధికారులు శుభవార్త తెలిపారు. పాముల సంబంధిత ఫిర్యాదుల కోసం బోర్డు పై ఉన్న నంబర్లను సంప్రదించాలని సూచించారు. ఫిర్యాదు చేస్తే వారు వచ్చి, పాములను పట్టుకుంటారని GHMC అధికారులు పేర్కొన్నారు.

News December 2, 2024

HYD: చేవెళ్ల యాక్సిడెంట్.. CM రేవంత్ దిగ్భ్రాంతి

image

రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం ఆలూరు స్టేజ్‌ వద్ద కూరగాయలు అమ్ముకునే వారిపైకి లారీ దూసుకెళ్లిన ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ఆయన సంతాపం తెలియజేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను సీఎం ఆదేశించారు. కాగా, ఈ ప్రమాదంలో రైతులు ప్రేమ్(ఆలూరు), రాములు(ఆలూరు), సుజాత(ఖానాపూర్ ఇంద్రారెడ్డినగర్‌) అక్కడికక్కడే చనిపోయారు.