News July 9, 2024
సికింద్రాబాద్: తల్లి డబ్బులు ఇవ్వలేదని యువకుడి ఆత్మహత్య

వ్యాపారం కోసం తల్లిని డబ్బులు అడగగా.. తన వద్ద లేవని చెప్పడంతో మనస్తాపానికి గురైన కొడుకు తన ఫోన్ స్టేటస్లో ‘ఇది నా చివరి రోజు’ అని పెట్టుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సికింద్రాబాద్ జీఆర్పీ పోలీసుల కథనం ప్రకారం.. మిర్జాలగూడలో నివాసముండే లలిత కుమార్ వాసు(25) టిఫిన్ బండి పెట్టుకోవడానికి రూ.5 లక్షలు కావాలని తల్లిని అడిగాడు. ఇవ్వక పోవడంతో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు చెప్పారు.
Similar News
News November 19, 2025
రేపు నాంపల్లి సీబీఐ కోర్టుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి

ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి రేపు HYDకు రానున్నారు. ఉదయం తాడేపల్లి నుంచి గన్నవరం ఎయిర్పోర్ట్కి చేరుకుని, అక్కడి నుంచి నగరానికి వస్తారు. బేగంపేట్ నుంచి నేరుగా నాంపల్లి CBI కోర్టులో హాజరవుతారు. అనంతరం లోటస్ పాండ్కు, తిరిగి బేగంపేట్ నుంచి బెంగళూరుకు వెళ్తారు. యలహంక నివాసంలో రోజువారీ కార్యక్రమాలు కొనసాగిస్తారని ఆ పార్టీ ప్రతినిధులు తెలిపారు.
News November 19, 2025
నాంపల్లి కోర్టులో ఐబొమ్మ రవి బెయిల్, కస్టడీపై విచారణ

నాంపల్లి కోర్టులో ఐ బొమ్మ రవికి సంబంధించిన కస్టడీ పిటిషన్పై ఇవాళ విచారణ జరగనుంది. రవిపై పోలీసులు కస్టడీ పిటిషన్ దాఖలు చేశారు. మరోవైపు నిందితుడు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. నిన్న ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం, ఇవాళ్టికి వాయిదా వేసింది. ఇవ్వాళ ఇరు వాదనల విచారించి తీర్పు ఇవ్వనుంది.