News November 1, 2024
సికింద్రాబాద్ నుంచి స్పెషల్ ట్రైన్లు

సికింద్రాబాద్, HYD, కాచిగూడ రైల్వే స్టేషన్ల నుంచి దీపావళి పండుగ వేళ నేడు ప్రత్యేక రైళ్లను నడిపిస్తున్నట్లుగా అధికారులు వెల్లడించారు. సౌత్ సెంట్రల్ రైల్వే జోన్ పరిధిలో నేడు ఏకంగా 29 ప్రత్యేక రైళ్లు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. HYD-గోరఖ్ పూర్, HYD-జైపూర్,సికింద్రాబాద్-బెర్హంపూర్,కాచిగూడ-నాగర్ కోయిల్, సికింద్రాబాద్-పాట్నాకు ప్రత్యేక రైళ్లు ఉన్నాయని ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
Similar News
News November 21, 2025
1956లో ప్రస్థానం ప్రారంభం.. నేటికి JNTUకి 60 ఏళ్లు

జేఎన్టీయూ ఇంజినీరింగ్ కళాశాల డైమండ్ జూబ్లీ వేడుకలకు ముస్తాబైంది. 1965లో నాగార్జున ఇంజినీరింగ్ కళాశాలగా ఆవిర్భవించి 1972లో జేఎన్టీయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్గా అవతరించింది. 2015లో గోల్డెన్ జూబ్లీ వేడుకలు నిర్వహించుకొని నేడు డైమండ్ జూబ్లీ వేడుకలకు యూనివర్సిటీ కళాశాల సిద్ధమైంది. ఈ 60 ఏళ్లలో ఎన్నో ఘనతలు సాధించి ఎంతోమంది విద్యార్థులను ఉన్నత శిఖరాలకు చేర్చింది.
News November 21, 2025
హైదరాబాద్ కలెక్టరేట్లో పానీ పరేషాన్

హైదరాబాద్ కలెక్టరేట్లో నీటి సమస్య నెలకొంది. నిత్యావసర పనులకూ నీరు లేక సిబ్బంది విలవిల్లాడుతున్నారు. పది రోజులుగా ఈ సమస్య నెలకొంది. పైప్లైన్ సమస్య కారణంగా నీటి ఇబ్బంది నెలకొంది. దీంతో అధికారులు, ఉద్యోగులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. నగర వ్యాప్తంగా అనేక మంది సమస్యలతో కలెక్టరేట్కు వస్తుంటారు. ఇందులో నీటి సమస్య ఉండటంతో అసహనం వ్యక్తం చేస్తున్నారు.
News November 21, 2025
HYD: లిటిల్ ఇంగ్లండ్ ఎక్కడో తెలుసా?

HYDలో ‘లిటిల్ ఇంగ్లండ్’గా పిలిచే ఓ ప్రాంతం ఉందని మీకు తెలుసా? ఈ ఏరియా ఆంగ్లో- ఇండియన్ నివాసస్థలాల ప్రధాన కేంద్రంగా ఉండేది. బ్రిటిష్ జీవనశైలి, ఇంగ్లిష్ సంప్రదాయాల స్పష్టమైన ముద్రతో ఈ ప్రాంతం ప్రత్యేక గుర్తింపును సంతరించుకుంది. వలస యుగపు సంస్కృతి ప్రతి వీధిలో ప్రతిధ్వనించేది. HYD సామాజిక రూపకల్పనలో ఓ ప్రత్యేక అధ్యాయంగా నిలిచింది. అదే సౌత్ లాలాగూడ. అందుకే దీనిని ‘లిటిల్ ఇంగ్లండ్’గా పిలిచేవారు.


