News June 9, 2024
సికింద్రాబాద్ నుంచి 19వ భారత గౌరవ్ యాత్ర ప్రారంభం
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి శనివారం 19వ భారత గౌరవ్ యాత్ర ప్రారంభమైంది. ఈ యాత్రను 75 సంవత్సరాల వయసున్న దినేశ్ చుట్కే, 63 సంవత్సరాల వయసున్న సాధన చుట్కే ప్రారంభించినట్లు రైల్వే అధికారులు తెలిపారు. 716 మంది పర్యాటకులతో 100 శాతం ఆక్యుపెన్సీతో రైలు సికింద్రాబాద్ నుంచి బయలుదేరినట్టు రైల్వే అధికారులు వెల్లడించారు.
Similar News
News January 16, 2025
RR: గంజాయి, డ్రగ్స్ డిస్పోజల్ చేయాలి: డిప్యూటీ కమిషనర్
రాష్ట్ర ఎక్సైజ్ శాఖ ప్రధాన కార్యాలయంలోని సమావేశ మందిరంలో రంగారెడ్డి డివిజన్ ఎక్సైజ్ యంత్రాంగంతో రంగారెడ్డి ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ పి.దశరథ్ సమీక్ష సమావేశం నిర్వహించారు. వారు మాట్లాడుతూ.. రంగారెడ్డి డివిజన్ పరిధిలోని 20 ఎక్సైజ్ పీఎస్‌లలో చాలా కేసుల్లో పట్టుబడిన గంజాయి, డ్రగ్స్ డిస్పోజల్ చేయాలని పేర్కొన్నారు. అదేవిధంగా వాహనాల వేలాన్ని వెంటనే పూర్తి చేయాలన్నారు.
News January 16, 2025
ఇబ్రహీంపట్నంలో దారుణం.. యువతిపై అత్యాచారం
HYD శివారు ఇబ్రహీంపట్నంలో దారుణ ఘటన వెలుగుచూసింది. బీటెక్ ఫస్టియర్ చదువుతున్న స్టూడెంట్‌పై అత్యాచారం జరిగింది. పూర్తి వివరాలు.. మంగళ్‌పల్లిలోని ఓ హాస్టల్‌లో ఉంటున్న యువతి పరీక్షలకు ప్రిపేర్ అవుతోంది. గదిలో ఒంటరిగా ఉన్న ఆమెపై అదే భవనంలో ఉండే రియల్ ఎస్టేట్ వ్యాపారి వద్ద పనిచేసే డ్రైవర్ అత్యాచారం చేశాడు. బాధితురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో PSలో కేసు నమోదైంది. మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
News January 16, 2025
శంకర్‌పల్లి: మరకత శివాలయానికి హంపి పీఠాధిపతి
శంకర్‌పల్లి మండలం చందిప్పలోని 11వ శతాబ్దానికి చెందిన శ్రీ బ్రహ్మసూత్ర మరకత శివాలయానికి ఫిబ్రవరి 5న హంపి పీఠాధిపతి హంపి విరూపాక్ష విద్యారణ్య భారతి మహాస్వామి రానున్నారని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. భక్తులు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.