News August 18, 2024
సికింద్రాబాద్: పార్ట్ టైం జాబ్ అని రూ.8.62 లక్షలు లూటీ

కారు చిత్రాలపై స్వైప్ చేస్తే లాభాలు ఇస్తామంటూ నమ్మించి సైబర్ నేరగాళ్లు డబ్బు కాజేశారు. పోలీసులు తెలిపిన వివరాలు.. సికింద్రాబాద్కు చెందిన వ్యాపారికి ఆన్లైన్లో పార్ట్ టైం జాబ్ పేరుతో మెసేజ్ వచ్చింది. మొదటగా కారు చిత్రాలపై స్వైప్ చేస్తే లాభాలు ఇచ్చారు. తర్వాత పెట్టుబడి పెట్టాలని సూచించగా.. నమ్మిన బాధితుడు రూ.8.62 లక్షలు పెట్టేశారు. తర్వాత మోసపోయామని గ్రహించి సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
Similar News
News November 16, 2025
HYD: బంధాన్ని నిలుపుకో.. వదులుకోకు..!

HYDలో మనువు మున్నాళ్ల ముచ్చటగా మారుతున్న పరిస్థితి కలవరపెడుతోంది. ఈగో, విలువలు తగ్గటం, వివాహేతర సంబంధాలు, అభద్రతా భావం, తొందరపాటు నిర్ణయాలు, కొత్తకల్చర్ వంటి వాటితో కోర్టు మెట్లెక్కుతున్నట్లు ఏటా నమోదవుతున్న కేసులు చెబుతున్నాయి. ఇందులో 25- 35 ఏళ్ల జంటలు 75% ఉన్నాయి. న్యాయస్థానాల్లో ప్రతినెలా 250 కేసులు నమోదవుతున్నాయి. బంధాన్ని బలపర్చుకోవడానికి ఆలోచించాలి కానీ బలహీనపరుచుకోవడానికి కాదని పెద్దల మాట.
News November 16, 2025
నగరంలో రోజురోజుకు పడిపోతున్న ఉష్ణోగ్రతలు

HYD పరిసరాల్లో చలి తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది. GHMC పరిధిలోని యూనివర్సిటీ ఆఫ్ HYDలో 10 డిగ్రీల సెల్సియస్ నమోదు కాగా BHEL 11.4, రాజేంద్రనగర్ 11.9, శివరాంపల్లి 12.2, గచ్చిబౌలి 12.5 డిగ్రీల సెల్సియస్ నమోదు అయినట్లు అధికారులు వెల్లడించారు. ముక్కు, చెవుల్లోకి చల్లగాలి వెళ్లకుండా ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఉపిరి తీసుకోవడంలో సమస్య ఉంటే వైద్యులను సంప్రదించాలి.
News November 16, 2025
శంషాబాద్: విమానంలో స్మోకింగ్ చేసిన ప్రయాణికుడు

విమానంలో పొగ తాగిన ప్రయాణికుడిని ఎయిర్ లైన్స్ సిబ్బంది పోలీసులకు అప్పగించారు. పోలీసుల వివరాలు.. రియాద్ నుంచి ఇండిగో విమానంలో శనివారం ఓ ప్రయాణికుడు శంషాబాద్కు వచ్చారు. ఈ క్రమంలో విమానంలోని మరుగుదొడ్డిలో పొగ తాగినట్లు ఎయిర్లైన్స్ సిబ్బంది గుర్తించి ఆర్జీఐఏ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


