News September 29, 2024

సికింద్రాబాద్: ప్రమాదాల నివారణకు రక్షణ కవచ్

image

సికింద్రాబాద్, కాచిగూడ సెక్షన్ ప్రాంతాల్లో రైల్వే ప్రమాదాల నివారణకు అధికారులు రక్షణ కవచ్ వ్యవస్థను అమలు చేస్తున్నారు. దాదాపు 273 కిలోమీటర్ల పరిధిలో దీనిని అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. 2019 నవంబర్ 11న కాచిగూడ రైల్వే స్టేషన్లో ఒకదానికొక రైలు ఎదురుగా ఢీకొంది. అలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా ఈ రక్షణ చేస్తున్నట్లు తెలిపారు. రక్షణ కవచ్ యంత్రాలు దాదాపు 28 స్టేషన్లో ఏర్పాటు చేశారు.

Similar News

News December 16, 2025

HYDలో KCR మీటింగ్ వాయిదా

image

ఈ నెల 19న జరగాల్సిన మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సమావేశాన్ని 21వ తేదీకి వాయిదా వేశారు. 19న పార్లమెంట్ సమావేశాలు ముగియనున్న నేపథ్యంలో, బీఆర్ఎస్ రాజ్యసభ ఎంపీలు సమావేశంలో పాల్గొనేలా ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేటీఆర్ స్పష్టంచేశారు.

News December 16, 2025

IDPL ల్యాండ్స్ వివాదంపై సర్కారు విచారణకు ఆదేశం

image

IDPL ల్యాండ్స్ వివాదంపై కాంగ్రెస్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 4000 కోట్ల రూపాయల విలువైన భూములపై విజిలెన్స్ విచారణకు ఆదేశాలు జారీ చేసింది. సంచలనంగా మారిన ఈ వివాదంలో తాజాగా ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ఎమ్మెల్సీ కవిత పరస్పరం భూకబ్జా ఆరోపణలు చేసుకున్నారు. అదేవిధంగా కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోనీ సర్వే నెంబర్ 376లో జరిగిన భూవివాదాలపై పూర్తి స్థాయి విచారణకు ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది.

News December 16, 2025

HYD: ‘చే’ చివరిపోరుకు ‘బొలీవియా డైరీ’ రూపం

image

‘బొలీవియా డైరీ’లో చేగువేరా చివరి రోజులు, గెరిల్లా పోరాటం, <<18569067>>విప్లవంపై<<>> ఆయన అచంచల నిబద్ధత.. హృదయాన్ని ఇందులోని అక్షరాలు కదిలిస్తాయి. ఆకలి, వ్యాధులు, ద్రోహం, అపజయాల మధ్య వెనకడుగు వేయని విప్లవ ఆత్మ ప్రతి పుటలో ఉప్పొంగుతుంది. విజయానికి మించిన సిద్ధాంత విశ్వాసమే చేగువేరా జీవన తత్వంగా బలమైన ముద్ర వేసింది. ఇది కేవలం పర్సనల్ డైరీ కాదు.. ప్రపంచ విప్లవ చరిత్రలో ఒక అమర పుట. ఇది యువతను ఆలోచింపజేసే రచన.