News July 18, 2024
సికింద్రాబాద్: ప్లాట్ ఫాం, రైలు మధ్యలో ఇరుక్కుని వ్యక్తి మృతి

గుర్తు తెలియని వ్యక్తి రైలు, ప్లాట్ ఫామ్ మధ్య ఇరుక్కుని అక్కడికక్కడే మృతి చెందిన ఘటన సికింద్రాబాద్ జీఆర్పీ పీఎస్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాలు.. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఓ గుర్తు తెలియని వ్యక్తి ప్లాట్ ఫామ్ నంబర్-3లో కాకతీయ ఎక్స్ ప్రెస్ రైలు ఎక్కుతున్నాడు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు కింద పడటంతో ప్లాట్ ఫాం, రైలు మధ్యలో ఇరుక్కుపోయి మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేశారు.
Similar News
News October 24, 2025
జూబ్లీహిల్స్ బస్తీల్లో మంత్రి సీతక్క

జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ను గెలిపిస్తే ఇంటింటికీ సంక్షేమ పథకాలు అందుతాయని మంత్రి సీతక్క అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం ఆమె బోరబండలోని సైట్ 3 ప్రాంతంలో పర్యటించి ఇంటింటికీ ప్రచారం చేశారు. కాంగ్రెస్ను గెలిపించాలని కోరారు. రూ.కోట్లతో నియోజకవర్గంలో అభివృద్ధి పనులు జరుగుతున్నట్లు గుర్తు చేశారు.
News October 24, 2025
బొమ్మల కొలువులో సచివాలయం, బిర్లా మందిర్

దీపావళి సందర్భంగా లక్ష్మీదేవి కొలువుదీరేలా బొమ్మల కొలువు రూపొందించి అందులో తెలంగాణ సచివాలయ భవనం, బిర్లా మందిర్ నమూనాలను ఏర్పాటు చేశారు. సికింద్రాబాద్ రెజిమెంటల్ బజార్లో నివసించే విజయ్ కుమార్ ఏటా ఇలా వినూత్నంగా కొత్త డిజైన్లతో బొమ్మలతో రూపొందిస్తుంటారు. అత్యంత ఆకర్షణంగా ఉన్న ఈ బొమ్మలను చూడటానికి వచ్చిన ప్రజలు విజయకుమార్ కళను అభినందిస్తున్నారు.
News October 24, 2025
HYD: CM సార్.. జర మా వైపు చూడండి!

పండగొచ్చినా, పబ్బమొచ్చినా ఆ జీవి రోడ్డెక్కాల్సిందే. చలి, వాన, ఎండ ఎరుగరు. ఏం చేస్తా మరి.. రెక్కాడితేనే డొక్కాడే జీవితాలు. బల్దియా కార్మికుల బాధ ఇది. ‘లక్షలు జీతాలు తీసుకునే వారికే పండుగ బోనస్లు.. మా వైపు ఎవరు చూస్తారు సార్’ అంటూ ఓ కార్మికుడు Way2Newsతో వాపోయాడు. వాస్తవానికి సిటీని క్లీన్ చేయడంలో పారిశుద్ధ్య సిబ్బంది కీలకం. CM చొరవ చూపితే తమ జీవితాలు బాగుపడతాయని కార్మికులు వేడుకుంటున్నారు.


