News July 21, 2024

సికింద్రాబాద్: బంగారు బోనం.. కవిత దూరం!

image

లిక్కర్ స్కాం కేసులో అరెస్టై తిహార్ జైలులో ఉన్న నేపథ్యంలో మొదటిసారి BRS MLC కవిత సికింద్రాబాద్ మహంకాళి బోనాలకు దూరమయ్యారు. తెలంగాణ ఉద్యమం సమయంలో జాగృతి ఏర్పాటు చేసి రాష్ట్ర సంస్కృతిని వ్యాప్తి చేసేలా ఏటా కవిత బంగారు బోనం ఎత్తుకొని అమ్మవారికి సమర్పిస్తున్నారు. కాగా ఈ సారి లష్కర్ బోనాల వేడుకలకు కవిత రాలేని పరిస్థితి ఉండడంతో పలువురు BRS నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Similar News

News November 19, 2025

HYD: రాహుల్ సిప్లిగంజ్ వివాహం.. సీఎంకి ఆహ్వానం

image

రాహుల్ సిప్లిగంజ్ ఇటీవల ఆగస్టులో తను ప్రేమించిన అమ్మాయి హరిణ్య రెడ్డితో నిశ్చితార్థం చేసుకున్నారు. వారి వివాహానికి నవంబర్ 27న పెద్దలు ముహూర్తం నిశ్చియించారు. ఈ వివాహానికి సినీ, రాజకీయ ప్రముఖులు భారీగా హాజరు కానున్నట్టు సమాచారం. తాజాగా రాహుల్ సిప్లిగంజ్ తనకు కాబోయే భార్య హరిణ్యరెడ్డితో కలిసి సీఎం రేవంత్ రెడ్డిని కలిసి.. తన వివాహానికి ఆహ్వానించారు.

News November 19, 2025

HYD: సంధ్య కన్వెన్షన్ కూల్చివేతలపై హైకోర్టు సీరియస్

image

సంధ్య కన్వెన్షన్ కూల్చివేతలపై సంధ్య శ్రీధర్‌రావు హైకోర్టును ఆశ్రయించారు. విచారించిన న్యాయస్థానం హైడ్రా తీరుపై సీరియస్ అయింది. కూల్చివేతలకు అనుమతి ఎవరిచ్చారని కోర్టు ప్రశ్నించింది. ‘కోర్టు ఆదేశాలను ఎందుకు పట్టించుకోలేదు’ అని హైడ్రాను నిలదీసింది. ఈ కేసు తదుపరి విచారణ గురువారానికి వాయిదా వేసింది.

News November 19, 2025

HYD: కేంద్రమంత్రికి చనగాని దయాకర్ బహిరంగ లేఖ

image

కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డికి కాంగ్రెస్ నేత చనగాని దయాకర్ బహిరంగ లేఖ రాశారు. తెలంగాణలో ఐఐఎంలు, ఐఐటీలు, పెట్రోలియం సంస్థలతోపాటు ఇతర కేంద్రీయ విద్యా సంస్థలను తక్షణమే మంజూరు చేయాలని లేఖలో విజ్ఞప్తి చేశారు. డిసెంబర్‌లో జరగనున్న పార్లమెంట్ సమావేశాల్లో జాతీయ విద్యాలయాల ఏర్పాటుకు సంబంధించిన కేంద్ర అనుమతిని మంజూరు చేయించాలని అభ్యర్థించారు.