News April 18, 2024

సికింద్రాబాద్: బీఫామ్ అందుకున్న ఎంపీ అభ్యర్థి

image

తెలంగాణ భవన్లో BRS అధ్యక్షుడు కేసీఆర్ అధ్యక్షతన జరిగిన పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశంలో సికింద్రాబాద్ పార్లమెంట్ అభ్యర్థి తీగుల్ల పద్మారావు గౌడ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పద్మారావుకు కేసీఆర్ బీ ఫా అందజేశారు. సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానాన్ని ఈసారి బీఆర్ఎస్ కైవసం చేసుకోనుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Similar News

News November 15, 2025

HYDలో పెరుగుతున్న వాయు కాలుష్యం..!

image

HYDలో వాయుకాలుష్యం, గాలిలో ధూళి కణాల సాంద్రత వృద్ధి చెందుతోంది. పర్టిక్యులేట్ మ్యాటర్ 242ను సూచిస్తుంది. మంచు, చల్లని గాలిలో ధూళికణాలు 4 నుంచి 8 అడుగుల ఎత్తులో అధిక మోతాదులో ఉంటాయని, దీంతో శ్వాసకోశ రోగాలు ప్రబలే అవకాశం ఉంటుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. నగరంలో మొత్తం 14 ప్రాంతాల్లో గాలినాణ్యతను కొలిచే యంత్రాలను PCB ఏర్పాటు చేసింది. కాగా, గాలినాణ్యత సూచి 100దాటితే ప్రమాదం ఉంటుందని PCB చెబుతోంది.

News November 15, 2025

ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయానికి రూ.65,38,889 ఆదాయం

image

ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయానికి ఫ్యాన్సీ నంబర్ల ద్వారా రూ.65,38,889 ఆదాయం వచ్చినట్లు అధికారులు తెలిపారు. శుక్రవారం ఖైరతాబాద్‌లో నిర్వహించిన ఆన్‌లైన్ బిడ్డింగ్‌లో TG09H9999 నంబర్‌కు రూ.22,72,222, TG09J009 నంబర్‌కు రూ.6,80,000, TG09J005 నంబర్‌కు రూ.2,40,100, TG09J007కు రూ.1,69,002, TG09J0123కు రూ.1,19,999 ఆదాయం వచ్చింది.

News November 15, 2025

శంషాబాద్: ఉజ్బెకిస్థాన్ మహిళను డిపార్ట్ చేసిన బంజారాహిల్స్ పోలీసులు

image

హైదరాబాద్‌లో అక్రమంగా నివసిస్తున్న ఉజ్బెకిస్థాన్ మహిళను అధికారులు డిపార్ట్ చేశారు. వీసా గడువు లేకుండా ఉన్నట్లు గుర్తించిన మిస్ బోడానోవా జిబాష్‌ను నిన్న రాత్రి ఎఫ్‌జెడ్–436 విమానం ద్వారా దుబాయ్‌కు పంపించారు. బంజారాహిల్స్ పోలీస్ సిబ్బంది ఆమెను డిపార్చర్ గేట్ వరకు ఎస్కార్ట్ చేయగా, అనంతరం ఎయిర్‌లైన్స్ సిబ్బంది, BOI అధికారులు పర్యవేక్షణలో విమానంలోకి ఎక్కించారు.