News July 19, 2024

సికింద్రాబాద్‌ బోనాలకు రావాలని KCRకు ఆహ్వానం

image

HYD ఆషాఢమాస బోనాల ఉత్సవాలకు‌ రావాలని మాజీ సీఎం, BRS అధినేత కేసీఆర్‌కు ఆహ్వానం అందింది. శుక్రవారం ఎర్రవల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో KCRను సికింద్రాబాద్‌ MLA పద్మారావు‌ గౌడ్, ఆయన కుమారులు మర్యాదపూర్వకంగా కలిశారు. బోనాల జాతరకు రావాలని ఆహ్వానించారు. ప్రతి ఏటా లష్కర్‌ బోనాలకు‌ వచ్చే కేసీఆర్‌, టక్కర్‌బస్తీలోని పద్మారావు ఇంట్లో ఏర్పాటు చేసిన విందులో పాల్గొంటారు.

Similar News

News October 21, 2025

HYD: సెల్యూట్.. వీరులారా మీకు వందనం!

image

తెలంగాణ పోలీస్ శాఖ ఉలిక్కిపడిన ఘటన ఇది. మావోలు ఏకంగా పోలీస్ స్టేషన్‌ను పేల్చేశారు. ఇది జరిగి 28 ఏళ్లు గుడుస్తున్నా నేటికి అమరులైన పోలీసులే యాదికొస్తుండ్రు. 1997లో యాచారం PSలో జమీల్ అహ్మద్, రాజేశ్వర్ రావు కానిస్టేబుళ్లుగా విధులు నిర్వహిస్తున్నారు. పథకం ప్రకారం మావోలు స్టేషన్‌‌ను పేల్చివేయడంతో విధి నిర్వహణలోనే ప్రాణాలు విడిచారు. పోలీస్ సంస్మరణ దినోత్సవం సందర్భంగా పోలీసు అమరులకు నివాళి అర్పిద్దాం.

News October 20, 2025

బండ్ల గణేశ్ ఇంటి నిండా టపాసులే

image

దీపావళి సందర్భంగా బండ్ల గణేశ్ తన ఇంట్లో వేడుకలకు సిద్ధమయ్యారు. ప్రతి ఏడాదిలాగే ఈ ఏడాది కూడా ఇంటి నిండా టపాసులు పరిచి ఫొటోని షేర్ చేశారు. అది సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ‘తెలుగు లోగిళ్లలో ఆరోగ్య, ఆనంద, విజయాల కాంతులు వెల్లివిరియాలని కోరుకుంటూ అందరికీ దీపావళి పండుగ శుభాకాంక్షలు’ అంటూ బండ్ల ట్వీట్ చేశారు.

News October 20, 2025

HYD: దీపావళి.. ‘B New’లో స్పెషల్ ఆఫర్లు

image

దీపావళి సందర్భంగా B New మొబైల్స్ & ఎలక్ట్రానిక్స్ స్పెషల్ ఆఫర్లు ప్రకటించింది. మొబైల్స్, ఎలక్ట్రానిక్స్‌పై వినూత్న ఆఫర్లను అందిస్తున్నట్లు ‘B New’ సంస్థ CMD వై.డి.బాలాజీ చౌదరి, CEO సాయి నిఖిలేష్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సాయి నితేశ్ వెల్లడించారు. తెలుగు రాష్ట్రాల్లో 150కిపైగా స్టోర్లతో ప్రజల విశ్వాసాన్ని చూరగొన్నామన్నారు. అన్ని వర్గాల వారికి అందుబాటులో ధరలు ఉన్నట్లు బాలాజీ చౌదరి వెల్లడించారు.