News August 24, 2024

సికింద్రాబాద్: ‘మంకీ ఫాక్స్ గాలిలో వ్యాప్తి చెందదు’

image

మంకీ ఫాక్స్ వ్యాప్తిపై గాంధీ హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ రాజకుమారి కీలక వ్యాఖ్యలు చేశారు. మంకీ ఫాక్స్ కేవలం ఆ రుగ్మత కలిగిన వారిని తాకినవారికి మాత్రమే సోకే అవకాశం ఉంటుందని, గాలిలో వ్యాప్తి చెందదని ఓ ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆదేశాల మేరకు మంకీ ఫాక్స్ బాధితులకు వైద్యం అందించడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు.

Similar News

News September 11, 2024

HYDలో 40 గంటల భారీ బందోబస్తు!

image

HYD నగరంలో గణపతి నిమజ్జనం చివరి రోజు 40 గంటల పాటు భారీ బందోబస్తు ఉంటుందని సీపీ CV ఆనంద్ తెలిపారు. ట్రాఫిక్, లా అండ్ ఆర్డర్, తదితర పోలీసులతో ఆయన సమావేశం నిర్వహించారు. మిలాద్ ఉన్ నబి వేడుకల్లో భాగంగా ఎక్కడికక్కడ చర్యలు తీసుకుంటామన్నారు. రౌడీలు, కమ్యూనల్ అంశాలపై ప్రత్యేక దృష్టి సాధించాలని కిందిస్థాయి అధికారులకు సూచించారు. శాంతియుతంగా వేడుకలు నిర్వహించుకోవాలన్నారు.

News September 11, 2024

HYD: శ్రీమహా విష్ణువుతో వినాయకుడి పాచికలు

image

సికింద్రాబాద్(లష్కర్)లో వివిధ రకాల గణపతులు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. కలాసిగూడలో శ్రీలక్ష్మీ గణపతి అసోసియేషన్ ఏర్పాటు చేసిన గణేశుడు వెరైటీగా ఉండి, భక్తుల నుంచి విశేష పూజలు అందుకుంటున్నాడు. శ్రీమహావిష్ణువుతో కూర్చొని పాచికలు ఆడుతున్నట్లుగా ఏర్పాటు చేసిన విగ్రహాల సెట్టింగ్ భక్తులను ఆకట్టుకుంటోంది. 108 రకాల స్వీట్లను తయారు చేసి, గణేశుడికి నైవేద్యంగా పెట్టారు.

News September 11, 2024

సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ రోడ్లు విస్తరించాలని సీఎంకు కిషన్ రెడ్డి లేఖ

image

సికింద్రాబాద్ రైల్వేస్టేషన్, చర్లపల్లి రైల్వే టర్మినల్‌కు వెళ్లే రోడ్లను విస్తరించాలని, దీనికి రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందించాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కోరారు. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డికి సోమవారం బహిరంగ లేఖ రాశారు. సికింద్రాబాద్, కాచిగూడ, నాంపల్లి స్టేషన్లకు పెరుగుతున్న రద్దీని దృష్టిలో ఉంచుకుని చర్లపల్లిలో రూ.415 కోట్లతో కొత్త రైల్వే టర్మినల్ నిర్మాణ పనులు కొనసాగిస్తున్నామన్నారు.