News February 6, 2025

సికింద్రాబాద్: మెట్టుగూడలో దారుణం

image

సికింద్రాబాద్‌ మెట్టుగూడలో దారుణ ఘటన వెలుగుచూసింది. చిలకలగూడ పీఎస్ పరిధిలో నివాసం ఉంటున్న రేణుక(55), ఆమె కుమారుడు యశ్వంత్‌ (30)పై ఐదుగురు దుండగులు కత్తులతో దాడి చేశారు. ఈ ఘటనలో తల్లి కుమారుడికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ సమాచారంతో అక్కడికి చేరుకున్న పోలీసులు బాధితులను గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News February 9, 2026

ప్రొద్దుటూరు అభివృద్ధిపై రేపు జిల్లా కలెక్టర్ సమీక్ష

image

ప్రొద్దుటూరు నియోజకవర్గం అభివృద్ధిపై మంగళవారం మధ్యాహ్నం 3.30 గంటలకు మున్సిపల్ కార్యాలయంలో కలెక్టర్ శ్రీధర్ అధ్యక్షతన సమీక్ష ఏర్పాటు చేశారు. స్థానిక ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి సూచన మేరకు సమావేశం ఏర్పాటు చేసినట్లు జిల్లా రెవెన్యూ అధికారి విశ్వేశ్వర నాయుడు తెలిపారు. నియోజకవర్గంలోని సంబంధిత ప్రభుత్వ అధికారులు ప్రగతి నివేదికలతో సమావేశానికి హాజరు కావాలని డీఆర్ఓ ఆదేశించారు.

News February 9, 2026

జమ్మికుంట: మార్కెట్ యార్డుకు 2 రోజులు సెలవు

image

మున్సిపాలిటీ ఎన్నికల నేపథ్యంలో జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ యార్డుకు ఈ నెల 10, 11 తేదీల్లో సెలవు ప్రకటిస్తున్నట్లు మార్కెట్ చైర్ పర్సన్ స్వప్న తెలిపారు. ఈ రెండు రోజుల్లో ప్రైవేట్ కొనుగోళ్లు, CCI ద్వారా జిన్నింగ్ మిల్లుల్లో జరిగే పత్తి కొనుగోళ్లు, స్లాట్ బుకింగ్‌లు కూడా నిలిపివేయబడతాయన్నారు. తిరిగి ఫిబ్రవరి 12 నుంచి యథావిధిగా కొనసాగుతాయి. కావున, రైతులు, ఆర్తి దారులు ఈ విషయాన్ని గమనించాలన్నారు.

News February 9, 2026

సచిన్‌లానే వైభవ్‌ను జట్టులోకి తీసుకోవాలి: శశిథరూర్

image

అద్భుతమైన ఆటతీరుతో వైభవ్ సూర్యవంశీ <<19067167>>సంచలనాలు<<>> సృష్టిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అతడిని సీనియర్ జట్టులోకి తీసుకోవాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. వైభవ్ మరింత త్వరగా ఉన్నత స్థాయికి చేరేందుకు అర్హుడని తాజాగా కాంగ్రెస్ నేత శశిథరూర్ ట్వీట్ చేశారు. ‘గతంలో 14 ఏళ్ల జీనియస్‌ను క్రీజులో చూశాం. అతడి పేరు సచిన్ టెండూల్కర్. అతడిని ఎక్కువ కాలం వేచి ఉండనివ్వలేదు’ అని పేర్కొన్నారు.