News August 20, 2024
సికింద్రాబాద్: రైతుల పక్షాన కాంగ్రెస్ ప్రభుత్వం: జూపల్లి

భారాస ప్రభుత్వం రూ.8 లక్షల కోట్ల అప్పులు, రూ. 40 వేల కోట్ల బకాయిలు మిగిల్చిందని.. అవి భారంగా మారినా కాంగ్రెస్ సర్కారు రుణమాఫీ చేసి రైతుల పక్షాన నిలిచిందని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. తన కార్యాలయంలో మాట్లాడుతూ.. ‘నిబంధనల ప్రకారం స్పష్టంగా ఉన్న బ్యాంకు ఖాతాలకు వెంటనే రుణమాఫీ అమలు చేశాం. గత ప్రభుత్వం తప్పిదాల వల్ల ఆధార్, పాస్ పుస్తకాల సమాచారం గందరగోళంగా ఉంది’ అన్నారు.
Similar News
News November 20, 2025
వికారాబాద్ కోర్టు చరిత్రలో తొలి సంచలన తీర్పు

VKB జిల్లా కోర్టు చరిత్రలో మొదటిసారిగా ఉరిశిక్షను విధిస్తూ గురువారం డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జి సంచలన తీర్పు వెలువరించారు. హత్యకు గురైన ఘటన 2019 ఆగస్టు 5న VKBలో చోటుచేసుకుంది. గృహ కలహాల నేపథ్యంలో నిందితుడు ప్రవీణ్ కుమార్ భార్యతో పాటు ఇద్దరు పిల్లలను దారుణంగా హతమార్చాడు. కేసు నమోదు చేసి పోలీసులు సమగ్ర విచారణ జరిపి ఛార్జ్షీట్ను దాఖలు చేశారు. కోర్టు నిందితుడికి కఠినమైన శిక్షను విధించింది.
News November 20, 2025
HYD: ఇంటింటికీ వెళ్లి చీరలు పంపిణీ చేయాలి: మంత్రి

ఇందిరమ్మ మహిళా శక్తి చీరల పంపిణీ పారదర్శకంగా నిర్వహించాలని మంత్రి సీతక్క అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. సెర్ప్ ఉన్నతాధికారులతో గురువారం HYD నుంచి టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన సీతక్క అధికారులకు దిశా నిర్దేశం చేశారు. కార్యక్రమాన్ని అత్యంత క్రమశిక్షణతో నిర్వహించాలని, ప్రత్యేకంగా రూపొందించిన యాప్ ద్వారా పంపిణీ వివరాలను ఎప్పటికప్పుడు నమోదు చేయాలని, గ్రామాల్లో ఇంటింటికీ వెళ్లి పంపిణీ చేయాలన్నారు.
News November 20, 2025
HYD: ‘మధ్యవర్తిత్వం వద్దు.. సబ్ రిజిస్టర్ను కలవండి’

సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో ఏసీబీ దాడుల నేపథ్యంలో సబ్ రిజిస్టర్ కార్యాలయ సిబ్బంది అలర్ట్ అవుతున్నారు. రిజిస్ట్రేషన్ సమయంలో ఎటువంటి మధ్యవర్తిత్వం లేకుండా నేరుగా రిజిస్ట్రేషన్కి సంబంధించిన సమస్యలను, సందేహాలను కార్యాలయంలోని సబ్ రిజిస్టర్ను నేరుగా కలిసి నివృత్తి చేసుకునేలా నోటీసులు అంటిస్తున్నారు. గండిపేట్ సబ్ రిజిస్టర్ కార్యాలయంలో సైతం ఈ నోటీసులు అంటించడంతో పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.


