News January 1, 2025
సికింద్రాబాద్ రైల్వేలో ఉద్యోగాలు

రైల్వే శాఖలో ఉద్యోగం చేయాలనుకునేవారికి శుభవార్త. తాజాగా RRB గ్రూప్ D నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తంగా 32000 పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. ఇందులో మన సికింద్రాబాద్ రీజియన్లోనూ ఖాళీలు ఉన్నాయని నోటిఫికేషన్లో రైల్వే శాఖ పేర్కొంది. స్టార్టింగ్ శాలరీ రూ. 18000 ఉంటుంది. 18-36 ఏళ్లు గలవారు అర్హులు. జనవరి 23 నుంచి ఫిబ్రవరి 22 వరకు అప్లై చేసుకోవచ్చు. అర్హత: 10th, ITI ఉత్తీర్ణత.
SHARE IT
Similar News
News November 19, 2025
రేపు నాంపల్లి సీబీఐ కోర్టుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి

ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి రేపు HYDకు రానున్నారు. ఉదయం తాడేపల్లి నుంచి గన్నవరం ఎయిర్పోర్ట్కి చేరుకుని, అక్కడి నుంచి నగరానికి వస్తారు. బేగంపేట్ నుంచి నేరుగా నాంపల్లి CBI కోర్టులో హాజరవుతారు. అనంతరం లోటస్ పాండ్కు, తిరిగి బేగంపేట్ నుంచి బెంగళూరుకు వెళ్తారు. యలహంక నివాసంలో రోజువారీ కార్యక్రమాలు కొనసాగిస్తారని ఆ పార్టీ ప్రతినిధులు తెలిపారు.
News November 19, 2025
నాంపల్లి కోర్టులో ఐబొమ్మ రవి బెయిల్, కస్టడీపై విచారణ

నాంపల్లి కోర్టులో ఐ బొమ్మ రవికి సంబంధించిన కస్టడీ పిటిషన్పై ఇవాళ విచారణ జరగనుంది. రవిపై పోలీసులు కస్టడీ పిటిషన్ దాఖలు చేశారు. మరోవైపు నిందితుడు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. నిన్న ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం, ఇవాళ్టికి వాయిదా వేసింది. ఇవ్వాళ ఇరు వాదనల విచారించి తీర్పు ఇవ్వనుంది.