News January 23, 2025

సికింద్రాబాద్‌ రైల్వేలో ఉద్యోగాలు

image

SCRలో ఉద్యోగం చేయాలనుకునేవారికి శుభవార్త. RRB గ్రూప్‌ D నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 32,438 పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. ఇందులో SCR పరిధిలో 1642 ఖాళీలు ఉన్నాయి. స్పెషల్ క్యాటగిరీలో మరో 710 ఖాళీలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్‌‌ విడుదలైంది. వేతనం రూ. 18000 ఉంటుంది. వయస్సు: 18-36 మధ్య ఉండాలి. నేటి నుంచి ఫిబ్రవరి 22 వరకు అప్లై చేసుకోవచ్చు. అర్హత: 10th, ITI ఉత్తీర్ణత.
SHARE IT

Similar News

News November 26, 2025

సమాచార హక్కు చట్టం పారదర్శకంగా అమలు చేయాలి: ఆర్టీఐ కమిషనర్

image

సమాచార హక్కు చట్టం పారదర్శకంగా అమలు కావాలని ఆర్టీఐ కమిషనర్ బోరెడ్డి అయోధ్య రెడ్డి అధికారులను సూచించారు. బుధవారం సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పెండింగ్ కేసులను త్వరగా పరిష్కరించి, అధికారులు భయపడకుండా ప్రజలకు సమాచారం అందించాలన్నారు. అన్ని శాఖల్లో రిజిస్టర్ నిర్వహణ చేయాలని అదనపు కలెక్టర్ శ్రీనివాస రెడ్డి సూచించారు.

News November 26, 2025

0-5 ఏళ్ల చిన్నారులకు ఆధార్ తప్పనిసరి: కలెక్టర్ జితేష్ వి.పాటిల్

image

జిల్లాలో 0-5 సంవత్సరాలలోపు వయసు గల పిల్లలందరికీ ఆధార్ నమోదు చేయించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి.పాటిల్ అన్నారు. బుధవారం ఐడీఓసీలో ఆధార్ మానిటరింగ్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్య, గ్రామీణాభివృద్ధి, పంచాయతీ, రెవెన్యూ శాఖల అధికారులకు ఆయన ఈ విషయాన్ని సూచించారు.

News November 26, 2025

NRPT: ఎన్నికలకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలి: ఈసీ

image

గ్రామ పంచాయతీ ఎన్నికలకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణి కుముదిని కలెక్టర్లను ఆదేశించారు. బుధవారం హైదరాబాద్ నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో నారాయణపేట కలెక్టర్ సిక్తా పట్నాయక్, ఎస్పీ డాక్టర్ వినీత్ పాల్గొన్నారు. ఎన్నికల ప్రవర్తన నియమావళిని కట్టుదిట్టంగా అమలు చేయాలని, జిల్లాలో నామినేషన్ల స్వీకరణకు పటిష్ట ఏర్పాట్లు చేయాలని కమిషనర్ సూచించారు.