News February 1, 2025
సికింద్రాబాద్ రైల్వేలో ఉద్యోగాలు.. 3 రోజులే అవకాశం

SCRలో ఉద్యోగం చేయాలనుకునేవారికి గుడ్‌న్యూస్. స్పోర్ట్స్ కోటా కింద రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్ దరఖాస్తులు స్వీకరిస్తోంది. సికింద్రాబాద్ హెడ్ క్వార్టర్స్‌లో 31, సికింద్రాబాద్ డివిజన్‌లో 5, హైదరాబాద్-5, విజయవాడ-5, గుంటూరు-5 నాందేడ్-5, గుంతకల్‌లో 5 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అర్హత: 10th, ఇంటర్, ITI ఉత్తీర్ణత. వయస్సు: 18 నుంచి 25 మధ్య ఉండాలి. అప్లై చేసేందుకు చివరి తేదీ: ఫిబ్రవరి 03, 2025.
SHARE IT
Similar News
News February 18, 2025
రుయ్యాడిలో కత్తిపోట్ల కలకలం.. ఒకరి మృతి

ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలంలో కత్తిపోట్లు కలకలం రేపాయి. మండలంలోని రుయ్యాడి గ్రామంలో ఓ వ్యక్తి మంగళవారం కత్తిపోటుకు గురయ్యారు. గ్రామంలో ఇద్దరు వ్యక్తుల మధ్యలో జరిగిన గొడవలో మహేందర్ అనే వ్యక్తిని ఓ వ్యక్తి కత్తితో పొడిచి హత్య చేసినట్లు సమాచారం. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపడుతున్నారు.
News February 18, 2025
కువైట్‌లో మొగలికుదురు వాసి ఆత్మహత్య

మామిడికుదురు మండలం మొగలికుదురుకు చెందిన నేదూరి తారక ముత్యాలరాము(24) ఈనెల 13న కువైట్‌లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అతని మృతదేహం సోమవారం స్వగ్రామం చేరింది. కొమరాడకు చెందిన ఏజెంట్ వలవల నాగరాజు వేధింపుల వల్లే తమ కుమారుడు ఆత్మహత్య చేసుకున్నాడని రాము తల్లితండ్రులు సురేశ్, రామలక్ష్మి మంగళవారం ఆందోళన వ్యక్తం చేశారు. ఏజెంట్ పై చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ, కలెక్టర్‌కు ఫిర్యాదు చేశామన్నారు.