News July 26, 2024
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వద్ద హత్య

HYDలో వరుస హత్యలు కలకలం రేపుతున్నాయి. సికింద్రాబాద్ గోపాలపురం పోలీసులు తెలిపిన వివరాలు.. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పార్కింగ్ వద్ద పని చేసే ముత్తుస్వామి(35)తో ఓ గుర్తుతెలియని వ్యక్తి గొడవపడ్డాడు. మాటామాట పెరగగా క్షణికావేశంలో ఆ వ్యక్తి ముత్తుస్వామి తలపై బండరాయితో కొట్టి చంపాడు. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వగా వారొచ్చి పరిశీలించారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News November 21, 2025
గాంధీభవన్: ఓటర్ ఇన్‌ఫర్‌మేషన్‌ను పబ్లిక్ డొమైన్‌లో పెట్టాలి: ఎమ్మెల్యే

ఓటర్ ఇన్‌ఫర్‌మేషన్‌ను పబ్లిక్ డొమైన్‌లో పెట్టాలని కాంగ్రెస్ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి అన్నారు. ఓట్ చోర్ గద్దె చోడ్ సిగ్నేచర్ కమిటీకి తనను ఛైర్మన్‌గా నియమించడం సంతోషంగా ఉందన్నారు. కమిటీ అంతా కలిసి పనులు విభజన చేసుకొని జిల్లా పర్యటనలు చేస్తామని చెప్పారు. డిజిటల్ ఓటర్ లిస్ట్ ఈసీ ప్రచురించాలని, అప్పుడే దొంగ ఓట్లు వేయడం ఆగుతుందన్నారు. ఓట్ చోరీకి బీజేపీ ఎలా పాల్పడుతుందో వివరిస్తామని వెల్లడించారు.
News November 20, 2025
HYD: కుటుంబ కలహాలతో వివాహిత ఆత్మహత్య

కుటుంబ కలహాలతో వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటన కొంపల్లిలోని పేట్ బషీరాబాద్ పీఎస్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. పేట్ బషీరాబాద్‌లో నివాసం ఉండే కుమ్మరి ప్రణయ(29) భర్తతో గొడవల కారణంగా ఆమె తల్లిదండ్రుల ఇంట్లో ఉంటోంది. రాత్రి ఇంట్లో గొడవల కారణంగా తీవ్ర మనస్తపానికి గురై తన గదిలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసులు ఈరోజు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.
News November 20, 2025
దిల్‌సుఖ్‌నగర్ మెట్రోస్టేషన్ వద్ద అసభ్యకరంగా హిజ్రాలు.. అరెస్ట్

HYD చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలోని దిల్‌సుఖ్‌నగర్ మెట్రో స్టేషన్ వద్ద రాత్రిళ్లు రోడ్లపై నిల్చొని అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతూ యువకులను ఇబ్బందులకు గురి చేస్తున్న ఇద్దరు హిజ్రాలను సీఐ సైదులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిని మెజిస్ట్రేట్ ముందు బైండోవర్ చేశారు. బహిరంగ ప్రదేశాల్లో చట్ట వ్యతిరేకమైన కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ హెచ్చరించారు.


