News September 20, 2024
సికింద్రాబాద్: వారం రోజుల్లో 443 ఫీవర్ కేసులు నమోదు
సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రికి వైరల్ జ్వరాల బాధితులు క్యూ కడుతున్నారు. వారం రోజుల్లో 443 ఫీవర్ కేసులు నమోదయ్యాయని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. 25 డెంగీ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీరందరికీ వైద్య సేవలు అందిస్తున్నట్లు ఆసుపత్రి డిప్యూటీ సూపరింటెండెంట్ తెలిపారు. వీరి కోసం ప్రత్యేక విభాగం కూడా ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. సీజనల్ వ్యాధుల నేపథ్యంలో ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.
Similar News
News October 10, 2024
HYD: మూసీలో తగ్గుతోన్న ఆక్సిజన్!
HYD మూసీ కాలుష్య కాసారంగా మారుతోంది. నీటిలో కరిగే ఆక్సిజన్ స్థాయి రోజురోజుకు తగ్గుతోంది. ఇదే సమయంలో రసాయనాల స్థాయి పెరుగుతుందని CPCB తెలిపింది. నీటిలో కరిగే ఆక్సిజన్(DO) CPCB ప్రకారం లీటర్ నీటిలో 6 మిల్లీ గ్రాములు ఉండాలి. కానీ, గండిపేట-6, బాపూఘాట్, ముసారాంబాగ్, నాగోల్, పీర్జాదిగూడ, ప్రతాపసింగారం, పిల్లాయిపల్లిలో 0.3 మాత్రమే ఉండటం ఆందోళనకరం. దీంతో మూసీలో జలచరాలు బతకడం కష్టమే.
News October 10, 2024
ALERT: సద్దుల బతుకమ్మ.. HYDలో ఈ రూట్ బంద్
సద్దుల బతుకమ్మ వేడుకల సందర్భంగా ట్యాంక్‌బండ్ పరిసర ప్రాంతాల్లో HYD పోలీసులు ఆంక్షలు విధించారు. అమరవీరుల స్మారకస్తూపం నుంచి అప్పర్ ట్యాంక్‌బండ్‌లోని బతుకమ్మ ఘాట్ వరకు సాధారణ వాహనాలకు అనుమతించరు. సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయి. వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని సూచించారు. ప్రస్తుతం హుస్సేన్‌సాగర్ చుట్టూ బతుకమ్మ వేడుక కోసం ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు.
News October 9, 2024
HYD: బస్సులు, రైళ్లు FULL.. వామ్మో కష్టమే..!
హనుమకొండ, వరంగల్, తొర్రూరు, ఖమ్మం సహా ఇతర ప్రాంతాలకు HYD నగరం నుంచి భారీ సంఖ్యలో ప్రజలు సొంతూర్లకు వెళ్తున్నారు. రేపు సద్దుల బతుకమ్మ పండుగ నేపథ్యంలో సాయంత్రం వేళ రైళ్లు, బస్సుల్లో ప్రయాణికుల రద్దీ కొనసాగుతోంది. కనీసం కూర్చునే పరిస్థితి లేదని ప్రయాణికులు వాపోయారు. రైళ్లలో వెళ్తున్న వారు ప్రతి స్టేషన్ ట్రెయిన్ వద్ద దిగి మళ్లీ ఎక్కాల్సిన పరిస్థితి ఏర్పడింది.