News February 1, 2025
సికింద్రాబాద్ వారసిగూడ మహిళ మృతి కేసులో ట్విస్ట్

సికింద్రాబాద్ వారసిగూడ <<15327304>>మహిళ మృతి<<>> కేసులో ట్విస్ట్ నెలకొంది. ఈనెల 22న తల్లి లలిత చనిపోగా డిప్రెషన్‌కు గురైన ఇద్దరు కూతుళ్లు చనిపోదామనుకుని సూసైడ్ లెటర్ రాశారు. కాగా నిన్న విషయం బయటకు రావడంతో పోలీసులు ఘటనా స్థలంలో ఆ సూసైడ్ లెటర్ స్వాధీనం చేసుకున్నారు. అయితే తండ్రి రాజుతో ఇద్దరు కూతుళ్లకు గొడవ జరగగా ఐదేళ్లుగా ఆయన దూరం వెళ్లిపోయాడు. నాలుగేళ్లుగా మేనమామతోనూ వారికి గొడవ ఉందని స్థానికులు తెలిపారు.
Similar News
News February 14, 2025
HYD: కుంభమేళా టూర్.. యువకుడి మృతి (PHOTO)

ప్రయాగ్‌రాజ్‌లోని కుంభమేళాకు బయలుదేరిన రంగారెడ్డి జిల్లా వాసులు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. కొంగరకలాన్‌కు చెందిన వనం సంపత్ రాణా, వనం శ్రీనివాస్, చంద్రశేఖర్, రమేశ్, సాయి కారులో బయల్దేరారు. నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండలం చిట్టాపూర్ శివారులో ముందు వెళుతున్న లారీని కారు ఢీ కొట్టింది. ఈ ఘటనలో <<15456821>>సంపత్ రాణా<<>> అక్కడికక్కడే మృతి చెందారు. మిగతా వారికి గాయాలు అయ్యాయి. మృతుడి ఫైల్ ఫొటో పైన చూడొచ్చు.
News February 14, 2025
గచ్చిబౌలిలో ఏసీబీకి పట్టుబడ్డ ఏడీఈ

గచ్చిబౌలిలోని ఎలక్ట్రిసిటీ కార్యాలయంలో ACB అధికారులు దాడులు నిర్వహించారు. లంచం తీసుకుంటూ గచ్చిబౌలి ఏడీఈ సతీశ్ కుమార్ పట్టుబడ్డారు. ట్రాన్స్‌ఫార్మర్ మంజూరుకు రూ.75వేలు డిమాండ్ చేశారు. వినియోగదారుల నుంచి ఇప్పటికే రూ.25 వేలు తీసుకున్నారు. కాగా, ఈరోజు మరో రూ.50 వేలు తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్‌గా ACB అధికారులు పట్టుకున్నారు.
News February 14, 2025
HYD: ఓయూ ఓపెన్ డిగ్రీ ప్రవేశ ప్రకటన

ఉస్మానియా విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ జి.రామ్‌రెడ్డి డిస్టెన్స్ ఎడ్యుకేషన్ సెంటర్ ఓపెన్ డిగ్రీ కోర్సుల రెండో విడత ప్రవేశాలు ప్రారంభమయ్యాయి. ఈ ప్రవేశాలు UGC-దూరవిద్య బ్యూరో (DEB) మార్గదర్శకాలకు అనుగుణంగా ఉంటాయి. అభ్యర్థులు www.osmania.ac.in లేదా oucde.net వెబ్‌సైట్‌ను సందర్శించి పూర్తి వివరాలను పొందవచ్చు. దరఖాస్తుకు చివరి తేది 31 మార్చి 2025.