News February 1, 2025

సికింద్రాబాద్ వారసిగూడ మహిళ మృతి కేసులో ట్విస్ట్

image

సికింద్రాబాద్ వారసిగూడ <<15327304>>మహిళ మృతి<<>> కేసులో ట్విస్ట్ నెలకొంది. ఈనెల 22న తల్లి లలిత చనిపోగా డిప్రెషన్‌కు గురైన ఇద్దరు కూతుళ్లు చనిపోదామనుకుని సూసైడ్ లెటర్ రాశారు. కాగా నిన్న విషయం బయటకు రావడంతో పోలీసులు ఘటనా స్థలంలో ఆ సూసైడ్ లెటర్ స్వాధీనం చేసుకున్నారు. అయితే తండ్రి రాజుతో ఇద్దరు కూతుళ్లకు గొడవ జరగగా ఐదేళ్లుగా ఆయన దూరం వెళ్లిపోయాడు. నాలుగేళ్లుగా మేనమామతోనూ వారికి గొడవ ఉందని స్థానికులు తెలిపారు.

Similar News

News December 4, 2025

SPMVV: కళ్యాణికి డాక్టరేట్

image

శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయ పరిశోధన విద్యార్థిని కళ్యాణి కశెట్టికి డాక్టరేట్ ప్రదానం చేసినట్లు డీన్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ అనురాధ తెలిపారు. ఈమె ప్రొఫెసర్ బి. శైలజ, ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ సైన్సెస్ మార్గదర్శకత్వంలో ‘డెవలప్మెంట్ ఆఫ్ క్వాలిటేటివ్ అండ్ క్వాంటిటేటివ్ అనలైటిక్ మెథడ్స్ ఫర్ సమ్ ఫైటోకెమికల్ మార్కర్స్’ అనే అంశంపై పరిశోధనా గ్రంథం సమర్పించినట్లు చెప్పారు.

News December 4, 2025

వీధికుక్కలు వెంబడిస్తే ఇలా చేయకండి!

image

బైకర్లను వీధికుక్కలు వెంబడించి భయపెట్టడం తెలిసిందే. ఈ సమయంలో కొందరు వాహనాన్ని వేగంగా నడిపి ప్రమాదానికి గురవుతుంటారు. నిన్న వరంగల్(D) మచ్చాపూర్‌లో కుక్కల భయానికి ఓ వ్యక్తి బైక్‌ను వేగంగా నడుపుతూ అదుపుతప్పి డ్రైనేజీలో పడి చనిపోయాడు. కుక్కలు వెంబడిస్తే బైక్‌ను వేగంగా నడపొద్దు. గట్టిగా అరిస్తే అవి మరింత రెచ్చిపోతాయి. రియాక్ట్ అవ్వకుండా ఉంటే అవి సైలెంట్ అవుతాయి. వాటి కళ్లలోకి నేరుగా చూడకండి.

News December 4, 2025

సిరి ధాన్యాలతో ఆరోగ్యానికి ఎంతో లాభం

image

చిరు ధాన్యాల సాగు, వినియోగం క్రమంగా పెరుగుతోంది. వాటి వల్ల ఆరోగ్యానికి కలిగే లాభాలే దీనికి కారణం. చిరుధాన్యాలను తీసుకున్నప్పుడు కడుపు నిండిన భావన కలిగి త్వరగా ఆకలి వేయదు. బరువు తగ్గాలనుకునేవారికి ఇవి మంచి ప్రత్యామ్నాయం. ఇవి శరీరంలో కొలెస్ట్రాల్‌ని, BP, షుగర్, గుండె వ్యాధుల ముప్పును తగ్గించి రక్తహీనతను దూరం చేస్తాయి. ఎక్కువ శారీరక శ్రమ చేసే వారు తొందరగా అలసిపోకుండా ఉండేందుకు మిల్లెట్స్ దోహదపడతాయి.