News April 25, 2024

సికింద్రాబాద్: సమ్మర్ స్పెషల్ ట్రైన్ల పొడిగింపు..!

image

సికింద్రాబాద్ సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు వేసవి వేళ రద్దీని దృష్టిలో పెట్టుకుని సమర్ స్పెషల్ ట్రైన్లను పొడిగిస్తున్నట్లు వెల్లడించారు. సికింద్రాబాద్, ఉదయ్‌పూర్ ఏప్రిల్ 30 నుంచి జూన్ 25 వరకు ప్రతి మంగళవారం, హైదరాబాద్, కటక్ మే 7 నుంచి జూన్ 25 వరకు ప్రతి మంగళవారం సేవలు అందిస్తుందని SCR అధికారులు వెల్లడించారు.

Similar News

News September 13, 2025

HYD: అందరూ ఈ 9000113667 నంబర్ సేవ్ చేసుకోండి..!

image

గ్రేటర్ HYDలో మూతలేని మ్యాన్ హోళ్లు చాలా చోట్ల మీకు కనిపిస్తాయి. అందులో ఎవరైనా పడి ప్రమాదాలకు గురి కావచ్చు. అందుకే మూతలేని మ్యాన్ హోల్‌ను మీరు చూస్తే వెంటనే 9000113667 నంబర్‌కు ఫోన్ చేసి సమాచారమివ్వండి. హైడ్రా అధికారులు తక్షణం స్పందించి దానికి మూతను ఏర్పాటు చేసే బాధ్యత తీసుకుంటారు. ఈ విషయం మీ మిత్రులు, సన్నిహితులకు కూడా షేర్ చేయండి. SHARE IT

News September 13, 2025

HYD: స్పోర్ట్స్ కాంప్లెక్సుల నిర్వహణ నుంచి తప్పుకుంటున్న GHMC!

image

నగరంలో చాలా చోట్ల GHMCకి స్పోర్ట్స్ కాంప్లెక్సులు ఉన్నాయి. అయితే వాటి నిర్వహణ భారంగా అనిపించిందో, లేక ఆదాయం పొందాలని అనుకుంటోందో తెలియదు కాని మెయింటెనెన్స్ నుంచి తప్పుకుంటోందని తెలుస్తోంది. సిటీలో ఉన్న పలు స్పోర్ట్స్ కాంప్లెక్సులను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించేందుకు నడుం బిగించింది. రెండేళ్లపాటు వాటిని ప్రైవేటుకు అప్పగించేందుకు టెండర్లు కూడా పిలిచింది. మొదటి దశలో 9 కాంప్లెక్సులను అప్పగించనుంది.

News September 13, 2025

సిటీకి రానున్న మీనాక్షి నటరాజన్.. వారం పాటు మకాం

image

కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ఈనెల 16న హైదరాబాద్‌కు వస్తున్నారు. వారం రోజుల పాటు ఇక్కడే ఉండి రాష్ట్రంలో పార్టీ పరిస్థితిపై నాయకులతో సమీక్షా సమావేశాలు నిర్వహిస్తారు. సీఎం రేవంత్ రెడ్డితోనూ సమావేశం నిర్వహించనున్నట్లు తెలిసింది. ముఖ్యంగా నామినేటెడ్ పోస్టులకు సంబంధించి ఈ వారం నిర్ణయం తీసుకోవచ్చని సమాచారం.