News May 4, 2024

సికింద్రాబాద్ ‘సికందర్’ ఎవరు?

image

సికింద్రాబాద్ లోక్‌సభ స్థానంలో గెలిచిన పార్టీనే కేంద్రంలో అధికారం చేపడుతుందనే సెంటిమెంట్ ఉంది. 1998 నుంచి ఇలాగే జరుగుతోంది. ఈసారి ఇక్కడ సిట్టింగ్ MP కిషన్ రెడ్డి (BJP), దానం నాగేందర్ (INC), పద్మారావు గౌడ్ (BRS) పోటీ పడుతున్నారు. ముగ్గురూ బలమైన నేతలే కావడంతో పోరు రసవత్తరంగా ఉండనుంది. ఇక్కడ 12 సార్లు కాంగ్రెస్, 5 సార్లు BJP, ఓసారి తెలంగాణ ప్రజా సమితి పార్టీ గెలిచింది. ఈసారి సికందర్ ఎవరో మీ కామెంట్?

Similar News

News October 28, 2025

జూబ్లీ బైపోల్: మంత్రులకు డివిజన్ల బాధ్యతలు

image

జూబ్లీహిల్స్ బైపోల్‌లో భాగంగా డివిజన్ల వారీగా మంత్రులకు సీఎం రేవంత్ రెడ్డి బాధ్యతలు అప్పగించారు. రహమత్‌నగర్- కోమటిరెడ్డి, పొంగులేటి, బోరబండ- సీతక్క, మల్లు రవి, వెంగళ్‌రావునగర్- తుమ్మల, వాకిటి శ్రీహరి, సోమాజిగూడ- శ్రీధర్ బాబు, అడ్లూరి, షేక్‌పేట్- కొండా సురేఖ, వివేక్, ఎర్రగడ్డ- దామోదర, జూపల్లి, యూసుఫ్‌గూడ- ఉత్తమ్, పొన్నం ప్రభాకర్‌కు ప్రచార బాధ్యతలు అప్పగించారు.

News October 28, 2025

క్యాబిన్ క్రూ జాహ్నవి గుప్తా ఆత్మహత్య

image

రాజేంద్రనగర్ పరిధిలో ఇండిగో ఎయిర్‌లైన్స్‌లో క్యాబిన్ క్రూ‌గా పనిచేస్తున్న జాహ్నవి గుప్తా ఆత్మహత్య చేసుకుంది. జమ్మూకు చెందిన జాహ్నవి, ఇటీవల ఇండిగో క్యాప్టెన్, స్నేహితుడితో కలిసి పార్టీకి హాజరై, అనంతరం తన గదిలో ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకుంది. కొన్ని రోజులుగా ఆమె డిప్రెషన్‌లో ఉన్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. అయితే, ఆత్మహత్యకు గల కారణాలను మాత్రం తల్లిదండ్రులు పోలీసులకు వెల్లడించడం లేదు.

News October 28, 2025

HYD: ఓపెన్ యూనివర్సిటీలో నవంబర్ 13 వరకు అవకాశం

image

డా.బీఆర్ అంబేడ్కర్ ఓపెన్‌ యూనివర్సిటీలో 2019-24 డిగ్రీ(BA/B.COM/BSC) విద్యార్థులకు ట్యూషన్‌ ఫీజు చెల్లించేందుకు NOV 13 వరకు అవకాశం ఉందని విద్యార్థి సేవల విభాగ డైరెక్టర్‌ డా.Y.వెంకటేశ్వర్లు ఓ ప్రకటనలో తెలిపారు. 2022-2024లో PG (MA/ M.COM/ MSC) అడ్మిషన్ పొందిన విద్యార్థులు కూడా ద్వితీయ సంవత్సరం ట్యూషన్‌ ఫీజు చెల్లించాలన్నారు. రిజిస్ట్రేషన్‌ కోసం www.braouonline.inను సందర్శించాలని ఆయన సూచించారు.