News September 15, 2024
సికింద్రాబాద్: 15,000 మంది పోలీసులతో భారీ బందోబస్తు

గ్రేటర్ పరిధిలో గణేశ్ నిమజ్జనం కోసం 15,000 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు హైదరాబాద్ సీపీ సీవీఆనంద్ తెలిపారు. ట్యాంక్ బండ్ సహా ఇతర అన్ని చెరువుల వద్ద ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. నిమజ్జనం రోజున ఉండే వేరే కార్యక్రమాలకు ప్రత్యేకంగా బందోబస్తు ఇస్తున్నామన్నారు. హైదరాబాద్ కమిషనరేట్ పోలీసులతో పాటు ఇతర జిల్లాల నుంచి ప్రత్యేక సిబ్బందిని తెస్తున్నామన్నారు.
Similar News
News December 2, 2025
HYDలో యూరోపియన్ ఫిల్మ్ ఫెస్టివల్

హైదరాబాద్లో మరో ప్రతిష్టాత్మక కార్యక్రమం జరగనుంది. యూరోపియన్ ఫిల్మ్ ఫెస్టివల్ కోసం హైదరాబాదులో ఏర్పాట్లు జరుగుతున్నాయి. 23 యూరోపియన్ దేశాలకు చెందిన 23 ఉత్తమ చిత్రాలు ఈ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శితం కానున్నాయి. ప్రసాద్ ల్యాబ్ ప్రివ్యూ థియేటర్, శ్రీసారథి స్టూడియోస్, అలయన్స్ ఫ్రాన్సిస్ హైదరాబాద్లో ఈ సినిమాలు ప్రదర్శించనున్నారు. ఈనెల 5వ తేదీ నుంచి 14 వరకు ఉచితంగా ప్రదర్శించనున్నట్లు తెలిపారు.
News December 2, 2025
HYD: రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు

కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వేసిన పిటిషన్లపై రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు ఇచ్చింది. ఖాజాగూడా చెరువు ఎఫ్టిఎల్ పరిధిలో 8 భారీ టవర్స్ అక్రమంగా నిర్మిస్తున్నారని, చర్యలు తీసుకోవాలని హైకోర్టులో ఎమ్మెల్యేలు అనిరుద్ రెడ్డి, యెన్నం శ్రీనివాస్, మురళి నాయక్, రాకేష్ రెడ్డి పిటిషన్ వేశారు. విచారణ చేపట్టిన న్యాయస్థానం 4 వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి, బిల్డర్లకు నోటీసులిచ్చింది.
News December 2, 2025
HYD: సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో అవినీతి స్లాట్స్

సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో అవినీతి రోజురోజుకు పెరిగిపోతుంది. అవినీతిని అరికట్టేందుకు తెచ్చిన స్లాట్ బుకింగ్ను అక్రమార్కులు తమ దందాకు వాడుకుంటున్నారు. HYD పరిధిలోని 45 సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో ఇది సాగుతోంది. లాగిన్ ఐడీలను క్రియేట్ చేసి అవసరం లేకుండా స్లాట్ బుక్ చేస్తున్నారు. అత్యవసరంగా రిజిస్ట్రేషన్ చేసుకున్న వారి నుంచి ఎక్కువ డబ్బులు లాగుతూ రిజిస్ట్రేషన్లు చేస్తున్నట్లు ప్రజలు తెలిపారు.


