News August 17, 2024
సికింద్రాబాద్: 19, 20న ఎనిమిది ప్రత్యేక రైళ్లు

పంద్రాగస్టు, వారాంతపు సెలవుల నేపథ్యంలో ఈనెల 19, 20న మరో ఎనిమిది ప్రత్యేక రైళ్లను దక్షిణమధ్య రైల్వే ప్రకటించింది. సికింద్రాబాద్- నర్సాపూర్ మార్గంలో 2, కాచిగూడ-తిరుపతి మార్గంలో 2, సికింద్రాబాద్- కాకినాడ టౌన్ మార్గంలో 4 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు పీఆర్వో శ్రీధర్ తెలిపారు. సికింద్రాబాద్ నుంచి బయల్దేరే ఈ ప్రత్యేక రైళ్లు నల్గొండ, నడికుడి, గుంటూరు, విజయవాడ మీదుగా నడుస్తాయని వెల్లడించారు.
Similar News
News November 19, 2025
HYD: సంధ్య కన్వెన్షన్ కూల్చివేతలపై హైకోర్టు సీరియస్

సంధ్య కన్వెన్షన్ కూల్చివేతలపై సంధ్య శ్రీధర్రావు హైకోర్టును ఆశ్రయించారు. విచారించిన న్యాయస్థానం హైడ్రా తీరుపై సీరియస్ అయింది. కూల్చివేతలకు అనుమతి ఎవరిచ్చారని కోర్టు ప్రశ్నించింది. ‘కోర్టు ఆదేశాలను ఎందుకు పట్టించుకోలేదు’ అని హైడ్రాను నిలదీసింది. ఈ కేసు తదుపరి విచారణ గురువారానికి వాయిదా వేసింది.
News November 19, 2025
HYD: కేంద్రమంత్రికి చనగాని దయాకర్ బహిరంగ లేఖ

కేంద్ర మంత్రి కిషన్రెడ్డికి కాంగ్రెస్ నేత చనగాని దయాకర్ బహిరంగ లేఖ రాశారు. తెలంగాణలో ఐఐఎంలు, ఐఐటీలు, పెట్రోలియం సంస్థలతోపాటు ఇతర కేంద్రీయ విద్యా సంస్థలను తక్షణమే మంజూరు చేయాలని లేఖలో విజ్ఞప్తి చేశారు. డిసెంబర్లో జరగనున్న పార్లమెంట్ సమావేశాల్లో జాతీయ విద్యాలయాల ఏర్పాటుకు సంబంధించిన కేంద్ర అనుమతిని మంజూరు చేయించాలని అభ్యర్థించారు.
News November 19, 2025
ఆన్లైన్లో అమ్మాయిలపై వేధింపుల్లో HYD ఫస్ట్!

నేషనల్ క్రైమ్ రిపోర్ట్ ప్రకారం ఆన్లైన్లో చిన్నారులు, మహిళలపై జరుగుతున్న వేధింపుల్లో దేశంలోనే HYD నం.1గా నిలిచింది. ఇతర మెట్రో నగరాలతో పోలిస్తే ఇలాంటి ఘటనలు హైదరాబాద్లో ఎక్కువగా నమోదయ్యాయి. ఆన్లైన్లో అసభ్య మెసేజ్లు పంపడం, మార్ఫింగ్ ఫొటోలు పంపించడం, అమ్మాయికి నచ్చకపోయినా వరుసగా మెసేజ్లు పంపుతూ ఇబ్బంది పెట్టడం వంటి వేధింపులు ప్రధానంగా కనిపిస్తున్నాయని నివేదికలో వెల్లడైంది.


