News August 17, 2024
సికింద్రాబాద్: 19, 20న ఎనిమిది ప్రత్యేక రైళ్లు

పంద్రాగస్టు, వారాంతపు సెలవుల నేపథ్యంలో ఈనెల 19, 20న మరో ఎనిమిది ప్రత్యేక రైళ్లను దక్షిణమధ్య రైల్వే ప్రకటించింది. సికింద్రాబాద్- నర్సాపూర్ మార్గంలో 2, కాచిగూడ-తిరుపతి మార్గంలో 2, సికింద్రాబాద్- కాకినాడ టౌన్ మార్గంలో 4 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు పీఆర్వో శ్రీధర్ తెలిపారు. సికింద్రాబాద్ నుంచి బయల్దేరే ఈ ప్రత్యేక రైళ్లు నల్గొండ, నడికుడి, గుంటూరు, విజయవాడ మీదుగా నడుస్తాయని వెల్లడించారు.
Similar News
News December 12, 2025
తొలి విడతలో RRలో 88.67% పోలింగ్ నమోదు

జిల్లాలోని 7 మండలాల్లో గురువారం తొలి విడత ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఉ. 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పోలింగ్ జరిగింది. 2 గంటల నుంచి కౌంటింగ్, రాత్రి వరకు తుది ఫలితాలు వెల్లడించారు. ఎన్నికలు ముగిసే సమయానికి 88.67% పోలింగ్ నమోదైంది. అత్యధికంగా కొత్తూరు మండలంలో 91.27% నమోదు కాగా అత్యల్పంగా 86.85% శంషాబాద్‌లో నమోదైంది.
News December 11, 2025
షాద్‌నగర్ MLA స్వగ్రామంలో BRS గెలుపు

షాద్‌నగర్ MLA స్వగ్రామం నందిగామ మండలంలోని వీర్లప్లలిలో BRS బలపరిచిన అభ్యర్థి గెలుపు ఢంకా మోగించారు. వీర్లపల్లి గ్రామ సర్పంచ్‌గా పాండు గెలుపు టాక్ ఆఫ్ ది నియోజకవర్గంగా మారింది. దీంతో బీఆర్ఎస్ నేతలు గ్రామంలో అంబరాన్నంటేలా సంబరాలు నిర్వహించారు. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ, గ్రామ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని వారు తెలిపారు. 21 పంచాయతీల్లో సర్పంచ్ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి.
News December 11, 2025
రంగారెడ్డిలో BRS vs కాంగ్రెస్

రంగారెడ్డి జిల్లాలో మొదటి విడత సర్పంచ్ ఎన్నికల్లో నందిగామ, జిల్లేడ్ చౌదరిగూడం, కొత్తూరు మండలాలు బోణి కొట్టాయి. నందిగామ (M) బుగ్గోనితండా సర్పంచ్‌గా కాంగ్రెస్ బలపరిచిన బుగ్గసాలయ్య, జిల్లేడ్(M) ముష్టిపల్లి సర్పంచ్‌గా BRS బలపరిచిన జంగయ్య గెలుపొందారు. దీంతో BRS, కాంగ్రెస్ మధ్య ఫైట్ టఫ్‌గా ఉండనున్నట్లు తెలుస్తోంది. అలాగే కొత్తూరు (M) మల్లాపూర్ తండా సర్పంచ్‌గా ఇండిపెండెంట్ మీనాక్షి దశరథ్ గెలుపొందారు.


