News January 1, 2025

సికింద్రాబాద్: 84 మంది పిల్లలను రక్షించిన RPF

image

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పరిధిలో 2024లో “ఆపరేషన్ స్మైల్” “ముస్కాన్” కార్యక్రమాల ద్వారా 84 పిల్లలను రక్షించారు. ఇందులో 59 బాలురు, 25 బాలికలు ఉన్నారు. రైల్వే ప్రోటెక్షన్ ఫోర్స్ (RPF), చైల్డ్ లైన్ స‌హా వివిధ సంస్థలు సంయుక్తంగా ఈ కార్యాచరణను చేపట్టాయి. ఈ కార్యక్రమం ద్వారా బాల కార్మికులుగా పని చేస్తున్న పిల్లలను హత్తుకు చేర్చుకున్నారు.

Similar News

News January 8, 2025

చర్లపల్లి టెర్మినల్ ఓపెన్.. మరి రోడ్లు?

image

చర్లపల్లి టెర్మినల్ అత్యాధునిక హంగులతో‌ ప్రారంభమైంది. స్టేషన్‌కు వెళ్లే రోడ్లను మరింత అభివృద్ధి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని స్థానికుల అభిప్రాయం. సిటీ నుంచి వచ్చే వారు హబ్సిగూడ, నాచారం, మల్లాపూర్ మీదుగా స్టేషన్‌కు చేరుకోవచ్చు. కీసర, మేడ్చల్, ECIL వాసులు రాంపల్లి మీదుగా వస్తారు. ప్రస్తుతం ఈ రహదారులు బాగానే ఉన్నాయి. ప్రయాణికుల రద్దీ పెరిగితే రోడ్లను విస్తరించాల్సిందేనా..? దీనిపై మీ కామెంట్?

News January 7, 2025

ఎస్సీ వర్గీకరణ అమలుకు కృషి చేస్తా: AICC సెక్రెటరీ

image

AICC సెక్రెటరీ సంపత్ కుమార్‌ను మంద కృష్ణ మాదిగ కలిశారు. ఎస్సీ వర్గీకరణను రాష్ట్ర ప్రభుత్వం ద్వారా అమలు చేయించాలని సంపత్‌ని కోరారు. చేవెళ్ల డిక్లేరేషన్, అసెంబ్లీలో CM రేవంత్ చేసిన ప్రకటనకు అనుగుణంగా వర్గీకరణను త్వరగా అమల్లోకి తీసుకొచ్చేలా కృషి చేయాలన్నారు. వేల గొంతులు-లక్షల డప్పుల కార్యక్రమంలో పాల్గొనాలని ఆహ్వానించారు. వర్గీకరణ పూర్తవడానికి తన వంతు కృషి చేస్తానని సంపత్ హామీ ఇచ్చారని కృష్ణ తెలిపారు.

News January 7, 2025

క్రీడలకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నాం: CM

image

క్రీడలకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. సోమవారం రాత్రి HYDలోని సీఎం నివాసంలో మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డితో కలిసి 68వ ఎస్జీఎఫ్ఐ అండర్-17 బాలబాలికల జాతీయ హ్యాండ్ బాల్ ఛాంపియన్షిప్ పోటీల పోస్టర్‌ను సీఎం ఆవిష్కరించారు. ఈ పోటీలు ఈనెల 10 నుంచి 14 వరకు మహబూబ్‌నగర్ జిల్లా మైదానంలో ప్రారంభం కానున్నాయి.