News July 4, 2024
సికింద్రాబాద్: B.Tech పూర్తి చేసిన ఆర్మీ అధికారులు
సికింద్రాబాద్ MCEME వద్ద జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ కాన్వకేషన్ డే నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా TES-41, B.Tech కోర్సు పూర్తి చేసిన ఆర్మీ అధికారులకు పట్టాలు అందజేసినట్లు తెలిపారు. ఇందులో శ్రీలంక, భూటాన్ ప్రాంతాలకు చెందిన ఆర్మీ అధికారులు సైతం ఉన్నట్లు డాక్టర్ రమేశ్ కంచర్ల తెలియజేశారు. ఉద్యోగంలోనే ఈ ఘనత సాధించడం గర్వంగా ఉందని అధికారులన్నారు.
Similar News
News October 14, 2024
HYD: అందరికీ ఆదర్శంగా నిలిచిన అక్కాచెల్లెళ్లు..!
రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం వెంకన్నగూడ గ్రామంలో సాధారణ జీవితం కొనసాగించే బండారి బాలరాజ్, భారతమ్మకు నలుగురు ఆడబిడ్డలు. తమకు ఆడబిడ్డలు ఉన్నారని ఏ మాత్రం దిగులు లేకుండా వారిని మగపిల్లలకు దీటుగా పెంచారు. అందులో ముగ్గురు అమ్మాయిలు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించారు. పెద్ద అమ్మాయి పోలీసు, రెండో అమ్మాయి స్టాఫ్‌నర్సు, నాలుగో కూతురు యమున టీచర్ ఉద్యోగం సాధించారు. వారిని గ్రామస్థులు అభినందించారు.
News October 14, 2024
HYD: వెళ్లిరా దుర్గమ్మా.. మళ్లీ రావమ్మా..!
HYD, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో డప్పు చప్పుళ్లు.. యువతీ యువకుల నృత్యాలు, కోలాటాల నడుమ దుర్గాదేవి నిమజ్జన శోభాయాత్ర ఆదివారం కనుల పండువగా సాగింది. ప్రధాన వీధుల గుండా సాగిన శోభాయాత్రలో ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. తొమ్మిది రోజుల విశేష పూజలందుకున్న ‘దుర్గమ్మ’ తల్లికి భక్తులు వీడ్కోలు పలికారు. వెళ్లిరా దుర్గమ్మా.. మళ్లీ రావమ్మా అంటూ నిమజ్జనం చేశారు.
News October 14, 2024
HYD: మేయర్ గద్వాల విజయలక్ష్మీపై కేసు నమోదు
GHMC మేయర్ గద్వాల విజయలక్ష్మీపై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. సద్దుల బతుకమ్మ సంబరాల సందర్భంగా ఈనెల 10న అర్ధరాత్రి సమయంలో భారీ శబ్దాలతో హంగామా చేశారని ఆమెపై పోలీసులు కేసు నమోదు చేశారు. నిర్దేశిత సమయం దాటినా పోలీసులు అనుమతించిన డెసిబుల్స్ కంటే భారీ శబ్దాలతో స్థానికులకు ఇబ్బందులు కలిగించారంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆమెతో పాటు ఈవెంట్ నిర్వాహకులు విజయ్, గౌస్‌పై కేసు నమోదు చేశారు.