News December 26, 2024
సిక్కోలుకు భారీ వర్షసూచన

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలహీనపడిన నేపథ్యంలో గురువారం శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాతో పాటు విశాఖ జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు వెల్లడించారు. ఈ మేరకు మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేశారు. ఓడ రేవుల్లో మూడో ప్రమాద హెచ్చరికలను అధికారులు జారీచేశారు.
Similar News
News December 24, 2025
ఈ నెల 26న మీ చేతికి మీ భూమి: మంత్రి

మీ చేతికి మీ భూమి 22 ఏ భూస్వేచ్ఛ పేరుతో ప్రత్యేక డ్రైవ్ ను ఈ నెల 26న శ్రీకాకుళంలోని జడ్పీ కార్యాలయంలో నిర్వహిస్తున్నామని మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. శ్రీకాకుళంలో జడ్పీ కార్యాలయంలో జిల్లా కలెక్టర్, రెవెన్యూ డివిజన్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. నిషేధిత భూముల విషయమై ఎవ్వరైనా విజ్ఞాపనలు చేసుకోవచ్చన్నారు. సంబంధిత అర్జీలను రెవెన్యూ అధికారులు పరిశీలించి, న్యాయం చేస్తారన్నారు.
News December 24, 2025
శ్రీకాకుళం: రైలు ప్రయాణికులకు GOOD NEWS

సంక్రాంతి పండగ నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే శాఖ శుభవార్త తెలిపింది. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా జనవరి 9వ తేదీ నుంచి 19వ తేదీ వరకు శ్రీకాకుళం రోడ్డు-సికింద్రాబాద్ మధ్య స్పెషల్ ట్రైన్లను నడపనున్నట్లు మంగళవారం ఓ ప్రకటన విడుదల చేసింది. శ్రీకాకుళం-సికింద్రాబాద్-శ్రీకాకుళం నంబర్ (07288/89) గల రైలును నడపనున్నట్లు తెలిపింది.
News December 24, 2025
26న రథసప్తమిపై ప్రజాభిప్రాయ సేకరణ: కలెక్టర్

అరసవల్లి క్షేత్రంలో రథసప్తమి వేడుకలను భక్తుల మనోభావాలకు అనుగుణంగా, అత్యంత వైభవంగా నిర్వహించడమే జిల్లా యంత్రాంగం లక్ష్యమని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ పేర్కొన్నారు. వచ్చే ఏడాది జనవరి 25న జరగనున్న వేడుకలను ఈసారి ఏడు రోజులగా జరుపుతున్నామన్నారు. ఏర్పాట్లుపై నగరంలోని జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ప్రజాభిప్రాయ సేకరణ ఉంటుందన్నారు.


