News July 29, 2024

సిక్కోలు కుర్రాడిపై విశాఖలో కిడ్నాప్ కేసు నమోదు

image

పాతపట్నంకు చెందిన శోభనాపురపు రాజేశ్వరరావు గత కొంతకాలంగా కుటుంబంతో పాటు విశాఖపట్నంలోని ఎంవీపీ కాలనీలో నివాసం ఉంటున్నాడు. అతని కుమారుడు శోభనాపురపు యువరాజు (23) పెదవాల్తేరుకు చెందిన మైనర్ బాలికను సోషల్ మీడియా ద్వారా పరిచయం చేసుకున్నాడు. అతని మాయమాటలతో ప్రేమలో పడిన అమ్మాయిని ఇంటి నుంచి తీసుకెళ్లిపోయాడు. అమ్మాయి తల్లిదండ్రుల ఫిర్యాదుతో పోలీసులు యువకుడు పై కిడ్నాప్ కేసు నమోదు చేశారు.

Similar News

News December 2, 2025

శ్రీకాకుళం: ఈనెల 5న మెగా పేరెంట్స్ మీట్.!

image

ఈనెల 5న మెగా పేరెంట్స్, టీచర్స్ మీటింగ్-3.0 ఉందని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ వెల్లడించారు. సోమవారం జెడ్పీ మందిరంలో విలేఖరుల సమావేశం నిర్వహించారు. గతంలో నిర్వహించిన 2 పేరెంట్స్, టీచర్స్ మీటింగ్‌లు విజయవంతంగా నిర్వహించినట్లు పేర్కొన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.

News December 1, 2025

పోలీసు సిబ్బంది ఆరోగ్యంపై దృష్టి పెట్టాలి: శ్రీకాకుళం SP

image

పోలీసు సిబ్బంది ఆరోగ్యంపై దృష్టి పెట్టాలని, సిబ్బంది సంక్షేమం దృష్ట్యా ఆరోగ్యం పరిరక్షణ కోసం వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని SP మహేశ్వరరెడ్డి పేర్కొన్నారు. సోమవారం శ్రీకాకుళంలోని జేమ్స్ ఆసుపత్రిలో పోలీసు సిబ్బందికి డాక్టర్ల బృందం జనరల్ చెకప్‌తోపాటు షుగర్, బీపీ, హృదయ సంబంధిత సమస్యలు, కంటి పరీక్షలు, దంత పరీక్షలు వంటివి చేశారు. ఆరోగ్యవంతమైన పోలీసు సిబ్బంది సమాజానికి అవసరమన్నారు.