News June 20, 2024
సిక్కోలు జిల్లాలో పిడుగు పాటుకు ఇద్దరు మృతి
శ్రీకాకుళం జిల్లాలో పిడుగు పాటుకు వేరువేరు ప్రాంతాల్లో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. సరుబుజ్జిలి మండలం కటకమయ్యపేట గ్రామంలో పిడుగుపాటుకు దేవరపల్లి బారికయ్య (72) మృతి చెందారు. బూర్జ మండలం అయ్యవారిపేట గ్రామంలో పిడుగు పాటుకు ఆవులు కాపరి చోడవరపు సత్యనారాయణ (30) మృతి చెందారు. ఈ ఘటనతో వారి కుటుంబాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి.
Similar News
News September 8, 2024
వంశధార, నాగావళి నదులకు వరద పెరిగే అవకాశం ఉంది: సీఎంఓ
శ్రీకాకుళం జిల్లాలోని వంశధార, నాగావళి నదులకు వరద ప్రవాహం పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో అధికారులు దానికి అనుగుణంగా చర్యలు తీసుకోవాలని ఆదివారం రాత్రి సీఎంఓ కార్యాలయం నుంచి ఆదేశాలు జారీ చేశారు. వరద ప్రవాహంపై ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ పరిస్థితిని సమీక్షించాలని సీఎం నారా చంద్రబాబునాయుడు అధికారులను కోరారు. జిల్లా ఉన్నతాధికారులు వరద ప్రవాహాంపై క్షేత్రస్థాయిలో సమీక్షిస్తున్నారు.
News September 8, 2024
ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం రద్దు: ఎస్పీ
శ్రీకాకుళంలో రేపు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్ధ (మీకోసం) వినతుల స్వీకరణ కార్యక్రమం నిర్వహించుట లేదని జిల్లా ఎస్పీ మహేశ్వర రెడ్డి ఆదివారం సాయంత్రం ఓ ప్రకటనలో తెలిపారు. ప్రతి సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించే ఈ కార్యక్రమం జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల తీవ్రత కారణంగా రద్దు చేయడం జరిగిందన్నారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని కోరారు.
News September 8, 2024
శ్రీకాకుళం: తుఫాన్ ఎఫెక్ట్.. 200 అడుగులు ముందుకు సముద్రం
శ్రీకాకుళం జిల్లాలోని తీర ప్రాంతాల్లో తుఫాన్ ప్రభావం కనిపిస్తుంది. తుఫాన్ నేపథ్యంలో ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురుస్తుండగా జిల్లాలో అధికారులు ఆరెంజ్ అలెర్ట్‌ను జారీ చేశారు. వజ్రపుకొత్తూరు మండలం మంచినీళ్లపేటలో సముద్రం సుమారు 200 అడుగులు ముందుకు రావడంతో గ్రామస్థులు ఆందోళన చెందుతున్నారు. ఇక జిల్లాలోని భావనపాడు, కళింగపట్నం తీర ప్రాంతాల్లో కూడా తుఫాన్ ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది.