News January 30, 2025

సిక్కోలు వాకిట.. జాతీ పిత మందిరం

image

శ్రీకాకుళం నగరంలోని శాంతినగర్ కాలనీలో ఉన్న నగరపాలక సంస్థ పార్క్‌లో మహాత్మాగాంధీ మందిరంతో పాటు స్వాతంత్య్ర సమరయోధుల స్మృతివనం ఉంది. ఇక్కడ ధాన్యముద్రలో ఉన్న గాంధీజీ విగ్రహం, మందిరం నాలుగువైపులా గాంధీ జీవితంలోని పలు ఘట్టాలను తెలియజేసేలా చిత్రాలు దర్శనమిస్తాయి. వనం చుట్టూ 40 మంది స్వాతంత్య్ర సమరయోధులు, సంఘ సంస్కర్తల విగ్రహాలను ఉంటాయి. 105 అడుగుల జాతీయ జెండా రెపరెపలాడుతూ పార్క్ మధ్యలో ఉంటుంది.

Similar News

News November 7, 2025

SKLM: సెకండ్ సాటర్డే సెలవులు రద్దు

image

రానున్న ఏడాది ఫిబ్రవరి నెల వరకు సెకండ్ సాటర్డే సెలవులు ఉండవని డీఈవో కే.రవిబాబు శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. రేపు యథావిధిగా జిల్లాలో పాఠశాలలు నడుస్తాయన్నారు. ఇటీవల సంభవించిన మొంథా తుఫాన్ సందర్భంగా సెలవులను వీటి ద్వారా భర్తీ చేస్తున్నామన్నారు. ఈ మేరకు రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి నుంచి ఉత్తర్వులు వచ్చాయని, విద్యాసంస్థలు ఈ విషయాన్ని గ్రహించాలని ఆయన కోరారు.

News November 7, 2025

దర్శకుడిగా మన సిక్కోలు వాసి..!

image

మన శ్రీకాకుళం కుర్రాడు రాహుల్ దర్శకుడిగా ప్రపంచానికి పరిచయం కానున్నాడు. సినిమాలపై మక్కువ, దర్శకుడు కావాలనే ఆసక్తితో చదువుతూనే మూవీ మేకింగ్ అంశాలను తెలుసుకున్నాడు. తొలుత వెబ్ సిరీస్‌లకు దర్శకత్వం, సహాయ దర్శకుడిగా పదేళ్లు పని చేశాడు.‘ది గ్రేట్ ఫ్రీ వెడ్డింగ్ షో’(కామెడీ జోనర్) మూవీకి డైరెక్షన్ వహించగా, ఆ చిత్రం నేడు ప్రపంచ వ్యాప్తంగా 200 థియేటర్లలో విడుదలవుతోంది.

News November 7, 2025

శ్రీకాకుళం: జిల్లా వ్యవసాయ అధికారిగా మనోహర్

image

జిల్లా వ్యవసాయ అధికారిగా మనోహర్ ప్రసాద్ గురువారం నూతనంగా బాధ్యతలు చేపట్టారు. జిల్లా వ్యవసాయ కార్యాలయంలో జిల్లా ప్రకృతి వ్యవసాయ ప్రాజెక్టు మేనేజర్ పూజారి సత్యనారాయణ, వ్యవసాయ శాఖ అధికారులు ఆయనను కలిసి అభినందించారు. వ్యవసాయ శాఖ సేవలు రైతులకు అందించడం లక్ష్యంగా పని చేస్తానని ఆయన అన్నారు. ప్రభుత్వ పథకాలు రైతులకు చేర్చడం, లాభసాటి వ్యవసాయ పద్ధతులు అమలు లక్ష్యంగా వివరించారు.