News August 3, 2024

సిటీలో RTC బస్సుల సంఖ్య పెంచాలి!

image

HYD సిటీలో బస్సుల సంఖ్య పెంచాలని కోరుతూ గాంధీ హాస్పిటల్ ఎదురుగా బస్ స్టాప్‌లో సంతకాల సేకరణ చేశారు. CPM నగర కార్యవర్గ సభ్యురాలు నాగలక్ష్మి మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వ మహిళల ఉచిత బస్సు పథకం మంచిదే కానీ.. HYD నగర జనాభాకు అనుగుణంగా బస్సుల సంఖ్య లేకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. గతంలో నగరంలో 3,800 బస్సులు ఉండేవని, గత BRS ప్రభుత్వం మూడేళ్లలో 1,000 బస్సులు తగ్గించిందన్నారు.

Similar News

News October 14, 2025

RR: ‘ధాన్యం కొనుగోళ్లలో అక్రమాలకు తావు ఇవ్వొద్దు’

image

వానాకాలం ధాన్యం కొనుగోళ్లు సజావుగా, అక్రమాలకు తావు లేకుండా జరగాలని రంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ చంద్రారెడ్డి సూచించారు. కొనుగోలు కేంద్రాల అధికారులు, వ్యవసాయ శాఖ అధికారులు, మిల్లర్లు, సివిల్ సప్లయ్ అధికారులతో మంగళవారం ఆయన అవగాహన సదస్సు నిర్వహించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కొనుగోళ్లు చేపట్టాలని ఆదేశించారు. ఈ సమావేశంలో డీసీఎస్ఓ వనజాత, డీఏఓ ఉష తదితరులు పాల్గొన్నారు.

News October 14, 2025

రంగారెడ్డి జిల్లాలో మద్యం టెండర్లకు స్పందన కరవు

image

రంగారెడ్డి జిల్లాలో మద్యం టెండర్లకు స్పందన కరవైంది. మద్యం టెండర్ల దాఖలు కోసం మరో 4 రోజులు మాత్రమే గడువు ఉన్నప్పటికీ టెండర్లు దాఖలు చేయడానికి వ్యాపారులు ఆసక్తి చూపకపోవడం గమనార్హం. జిల్లా వ్యాప్తంగా 249 మద్యం షాపులకు గాను కేవలం 1,253 మాత్రమే దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు పేర్కొన్నారు. గతంలో వైన్ షాపులకు జిల్లాలో ఎక్కడా లేనివిధంగా పోటీ ఉండేది. కానీ రియల్ ఎస్టేట్ ప్రభావం వైన్స్ టెండర్లపై పడింది.

News October 14, 2025

రంగారెడ్డి జిల్లా ప్రజావాణికి 48 ఫిర్యాదులు

image

RR జిల్లా కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 48 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్ నారాయణ రెడ్డికి విన్నవిస్తూ అర్జీలు ఇచ్చారు. కలెక్టర్ మాట్లాడుతూ.. రెవెన్యూ శాఖ-15, ఇతర శాఖలు-33, మొత్తం 48 దరఖాస్తులు అందాయన్నారు. అనంతరం అందించే వినతులను సంబంధిత శాఖల అధికారులు తక్షణమే పరిష్కరించాలని ఆదేశించారు.