News November 3, 2024

సిడ్నీ చేరుకున్న స్పీకర్ అయ్యన్నపాత్రుడు

image

ఏపీ శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు ఆస్ట్రేలియాలోని సిడ్నీ నగరానికి చేరుకున్నారు. న్యూ సౌత్ వేల్స్ పార్లమెంట్ ఆతిథ్యమిస్తున్న 67వ కామన్వెల్త్ పార్లమెంటరీ కాన్ఫరెన్స్ (సీపీసీ)లో పాల్గొనడానికి ఆయన సిడ్నీకి వెళ్లారు. ఆయనతో పాటు శాసనసభ కార్యదర్శి ప్రసన్న కుమార్ సూర్యదేవర ఉన్నారు. అయ్యన్నపాత్రుడును సిడ్నీ విమానాశ్రయంలో అక్కడ నివసిస్తున్న తెలుగు ప్రజలు ఘన స్వాగతం పలికారు.

Similar News

News October 16, 2025

విశాఖ పోలీసుల ఫైన్లపై మీరేమంటారు..!

image

విశాఖలో గత 15నెలల్లోనే పోలీసులు 8.54 లక్షల ఈ-చలాన్‌లు జారీ చేసి రూ.46.4కోట్ల ఫైన్ విధించారు. ఇప్పటి వరకు రూ.13.39కోట్లు రాబట్టారు. నగరంలో 12 లక్షల వాహనాలు ఉండగా.. కొందరు సిగ్నల్‌ జంప్, ఓవర్‌ స్పీడ్‌, రాంగ్‌ రూట్‌ డ్రైవింగ్ చేస్తున్నారు. దీంతో ప్రమాదాలు జరిగి ప్రతి 2రోజులకు ముగ్గురు ప్రాణాలు కోల్పోతున్నారు.మరోవైపు షాపులు, రైతుబజార్ల వద్ద పార్క్‌ చేసిన వాహనాలకూ ఫైన్లు వేయడంపై విమర్శలు వస్తున్నాయి.

News October 16, 2025

విశాఖలో ఎక్కడ చూసినా పాలిథిన్ కవర్లే.. నిషేధం ఎక్కడా?

image

GVMC పరిధిలో పాలిథిన్ వినియోగం ఆగడం లేదు. ప్రభుత్వం సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌పై నిషేధం విధించినా.. అమలు మాత్రం జరగడం లేదు. మార్కెట్లు, కిరాణా షాపులు, కూరగాయల సంతలు ఇలా ఎక్కడ చూసినా పాలిథిన్ కవర్లు సులభంగా దొరుకుతున్నాయి. GVMC అధికారుల నిర్లక్ష్యం కారణంగా నిషేధం కేవలం ప్రకటనలకే అంకితమైందని పలువురు విమర్శిస్తున్నారు. కాలుష్యం పెరిగి, డ్రైనేజీ వ్యవస్థలు మూసుకుపోతున్నా చర్యలు లేవని మండిపడుతున్నారు.

News October 16, 2025

వందేళ్ల ప్రస్థానం: ఆంధ్రా వర్సిటీ వైభవం

image

ఆంధ్ర విశ్వకళాపరిషత్ (ఏయూ) ఒక విజ్ఞాన ఖని. ఆర్ట్స్, సైన్స్, ఇంజినీరింగ్ వంటి విభాగాల్లో నాణ్యమైన విద్యను ఏయూ అందిస్తోంది. మెరైన్, బయాలజీ వంటి ప్రత్యేక కోర్సులకు నిలయం. వెంకయ్య నాయుడు, విశ్వనాథ సత్యనారాయణ వంటి మహామహులు ఇక్కడి పూర్వ విద్యార్థులే. శతాబ్ద కాలంగా ఈ విజ్ఞాన ఖని బాధ్యతగల పౌరులను, నాయకులను తీర్చిదిద్దుతూ ఆంధ్రుల గర్వకారణంగా నిలుస్తోంది.