News November 3, 2024

సిడ్నీ చేరుకున్న స్పీకర్ అయ్యన్నపాత్రుడు

image

ఏపీ శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు ఆస్ట్రేలియాలోని సిడ్నీ నగరానికి చేరుకున్నారు. న్యూ సౌత్ వేల్స్ పార్లమెంట్ ఆతిథ్యమిస్తున్న 67వ కామన్వెల్త్ పార్లమెంటరీ కాన్ఫరెన్స్ (సీపీసీ)లో పాల్గొనడానికి ఆయన సిడ్నీకి వెళ్లారు. ఆయనతో పాటు శాసనసభ కార్యదర్శి ప్రసన్న కుమార్ సూర్యదేవర ఉన్నారు. అయ్యన్నపాత్రుడును సిడ్నీ విమానాశ్రయంలో అక్కడ నివసిస్తున్న తెలుగు ప్రజలు ఘన స్వాగతం పలికారు.

Similar News

News December 8, 2024

విశాఖ: కష్టాల్లో ఆదుకుంటున్న నితీశ్..!

image

ఇండియా క్రికెట్ ఫ్యాన్స్‌కు పరిచయం అక్కర్లేని పేరు నితీశ్ కుమార్ రెడ్డి. సన్ రైజర్స్ తరఫున రైజింగ్ ఇన్నింగ్స్‌లు ఆడిన ఈ వైజాగ్ ఆల్ రౌండర్‌ IND టీంలో చోటు సాధించారు. ఫార్మాట్ ఏదైనా తనదైన శైలిలో నిలకడగా రాణిస్తూ జట్టు విజయాల్లో కీ రోల్ పోషిస్తున్నారు. బోర్డర్-గావస్కర్ టోర్నీలో అతని ఇన్నింగ్సే దీనికి నిదర్శనం. వరుసగా నాలుగు ఇన్నింగ్స్‌లలో 41,38,42,42 రన్స్ చేసి కష్టాల్లో ఉన్న జట్టును ఆదుకున్నారు.

News December 8, 2024

పాడేరులో ఉద్యోగిపై పోక్సో నమోదు

image

పాడేరు ఏకలవ్య మోడల్ పాఠశాలలో 7వ తరగతి విద్యార్థినిపై అఘాయిత్యానికి పాల్పడిన ల్యాబ్ ఉద్యోగి అనూజ్ సింగ్ పటేల్‌పై పోక్సో కేసు నమోదు చేశామని గిరిజన సంక్షేమ శాఖ డీడీ ఎల్.రజిని శనివారం తెలియజేశారు. ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి వి.అభిషేక్ ఆదేశాల మేరకు ప్రిన్సిపల్‌కు షోకాజ్ నోటీసులు జారీ చేశామని చెప్పారు. ఘటనపై విచారణ జరిపించి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.

News December 8, 2024

ఏయూకి పూర్వవైభవం తీసుకురావడానికి సహకరించాలి: లోకేశ్

image

ఏయూకి పూర్వ వైభవం తీసుకురావడానికి సహకరించాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ పిలుపునిచ్చారు. ఏయూ అలుమ్నీ మీట్‌లో మంత్రి పాల్గొన్నారు. ప్రపంచ ర్యాంకింగ్‌లో టాప్ 100లో ఏయూని ఒకటిగా నిలిపేందుకు కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఏయూని అంతర్జాతీయ స్థాయిలో మేటిగా నిలపాలన్నదే సీఎం చంద్రబాబు ఆశయమని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎల్‌అండ్‌టీ ఛైర్మన్ సుబ్రహ్మణ్యన్ పాల్గొన్నారు.