News April 11, 2024
సిద్దవటం: రైలు కిందపడి యువకుడి సూసైడ్

సిద్దవటం గాంధీ వీధిలో నివాసమున్న రెడ్డి మోహన్(18) భాకరాపేట-కనుములోపల్లి మార్గ మధ్యలో రైల్వే ట్రాక్ పై రైలు కింద మృతి చెందాడు. బుధవారం రాత్రి 2:30 గంటలకు గుర్తించామని, మృతికి గల కారణాలు విచారిస్తున్నామని రైల్వే పోలీసులు తెలియజేశారు. మృత్యువాత పడ్డ వ్యక్తి రెడ్డి మోహన్ ద్విచక్రవాహనంలో వచ్చాడని తెలిపాడు. స్వాధీనం చేసుకుని, పంచనామా నిమిత్తం కడప రిమ్స్‌కు తరలించామని రైల్వే పోలీసులు అన్నారు.
Similar News
News March 16, 2025
కడప: ‘డిగ్రీ కాలేజీల్లో ఒంటిపూట తరగతులు పెట్టాలి’

వైవీయూ పరిధిలోని అనుబంధ డిగ్రీ కళాశాలల్లో ఒంటిపూట తరగతులకు అనుమతించాలని ప్రభుత్వ కళాశాలల అధ్యాపక సంఘం (జీసీటీఏ), ప్రభుత్వ కళాశాల అధ్యాపకుల సంఘం (జీసీజీటీఏ) నాయకులు కోరారు. శనివారం వైవీయూలో రిజిస్ట్రార్ ఆచార్య పి.పద్మను కలిసి వారు వినతి పత్రం అందజేశారు. వేసవి తీవ్రత పెరిగిన నేపథ్యంలో ఒంటిపూట తరగతులు నిర్వహణకు అనుమతించాలన్నారు. నాయకులు శశికాంత్ రెడ్డి, నాగేశ్వర్ రెడ్డి, సుందరేశ్వర్ పాల్గొన్నారు.
News March 14, 2025
మైదుకూరు: ఘోర రోడ్డు ప్రమాదం.. దంపతులు మృతి

మైదుకూరు మండలం కేశలింగాయపల్లె వద్ద శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో పి. చలమయ్య, లక్ష్మీదేవి దంపతులు అక్కడికక్కడే మృతిచెందారు. మైదుకూరు పట్టణంలో నివాసం ఉంటున్న వీరు పొలం పనులు చూసుకొని తిరిగి వెళుతుండగా ఘటన జరిగినట్లు తెలుస్తోంది. లారీ ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనలో మరొకరికి గాయాలు కావడంతో చికిత్స కోసం తరలించారు.
News March 14, 2025
PDTR: ఆసుపత్రిలో దొంగతనానికి విఫలయత్నం

ఆసుపత్రిలోనే డాక్టర్ చైన్ కొట్టేయడానికి ఓ వ్యక్తి ప్రయత్నించాడు. ప్రొద్దుటూరు జిల్లా ఆసుపత్రిలో డాక్టర్ శ్రీవాణి గైనకాలజిస్ట్‌గా పనిచేస్తున్నారు. ఆపరేషన్ రూము వైపు వెళ్తుండగా.. మెట్ల వద్ద ఓ వ్యక్తి ఆమె మెడలోని చైన్ లాగడానికి ట్రై చేశాడు. అతడిని వెనక్కి నెట్టేయగా.. మరోసారి చైన్ తీసుకోవడానికి ప్రయత్నించాడు. డాక్టర్ కేకలు వేయడంతో పారిపోయాడు. ఈ దృశ్యాలన్నీ సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి.