News August 24, 2024
సిద్దవటం: రైలు కిందపడి వ్యక్తి ఆత్మహత్య

సిద్దవటం మండలంలోని భాకరాపేట రైల్వే స్టేషన్ యార్డ్ వద్ద శుక్రవారం గుర్తు తెలియని వ్యక్తి, గూడ్స్ రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నట్లు కడప రైల్వే స్టేషన్ ఎస్ఐ శ్రీనివాసరావు తెలిపారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ.. మృతుని వద్ద ఉన్న పర్సులో చరవాణి నంబర్లు బద్వేల్ ప్రాంతానికి చెందిన వారివిగా తేలాయని ఎస్ఐ చెప్పారు.
Similar News
News March 2, 2026
ప్రొద్దుటూరు: హాస్టల్లో విద్యార్థి ఆత్మహత్య

ప్రొద్దుటూరు పట్టణంలోని SC హాస్టల్లో విద్యార్థి మృతి కలకలం రేపింది. మైలవరం మండలం కల్లుట్ల గ్రామానికి చెందిన తలారి నరసింహులు(15) 10వ తరగతి చదువుతున్నాడు. మోడంపల్లె హాస్టల్లో ఉంటున్నాడు. ఏమైందో ఏమో రాత్రి హాస్టల్ ఆవరణలోని చెట్టుకు ఉరి వేసుకున్నాడు. మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి తరలించారు. 2టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.
News March 2, 2026
పుష్పగిరిలో కనపడని యువకుల ఆచూకీ

వల్లూరు మండలంలోని పుష్పగిరి పవిత్రమైన పుణ్యక్షేత్రంలో ఆదివారం సరదాగా ఈత కోసం దిగిన కొండాపురం మండలంలోని గండ్లూరుకు చెందిన శ్రీనాథ్ కడపకు చెందిన చైతన్య గల్లంతైన విషయం తెలిసిందే. వారికోసం పోలీసులు, బంధువులు గజ ఈతగాళ్ల సహాయంతో వెతుకులాట ఆరంభించారు. సోమవారం ఉదయం 9 వరకు వారి ఆచూకీ కనిపించలేదు. దాంతో వారి కుటుంబాలలో విషాద ఛాయలు అనుముకున్నాయి. వీరు కడప నగరంలో ఎంబీఏ చదువుతున్నారు.
News March 2, 2026
కడప జిల్లాలో గత నెలలో రిజిస్ట్రేషన్ల శాఖ ఆదాయం ఎంతంటే.!

జిల్లాలో గత నెలలో 5,329 రిజిస్ట్రేషన్లు జరగ్గా.. ప్రభుత్వానికి రూ.20.28 కోట్లు ఆదాయం లభించింది. ఈ ఆర్థిక సంవత్సరంలో నెలవారీగా రిజిస్ట్రేషన్ల సంఖ్య, ఆదాయం రూ.కోట్లలో ఇలా ఉంది. ఏప్రిల్-5274-20.86, మే-6461-22.98, జూన్-6382-22.12, జులై-6673-25.51, ఆగస్ట్-5486-21.91, సెప్టెంబర్-5988-23.81, అక్టోబర్-5988-21.73, నవంబర్-5527-22.67, డిసెంబర్-5907-23.35, జనవరిలో 5898 – రూ.26.45 కోట్లు వచ్చింది.


