News February 1, 2025

సిద్దిపేటలో అంబేడ్కర్ విగ్రహవిష్కరణ

image

సిద్దిపేటలోని 3వ వార్డు రంగదాంపల్లిలో అంబేడ్కర్ విగ్రహాఆవిష్కరణ కార్యక్రమంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు పాల్గొన్నారు. అంతటా అంబేడ్కర్ విగ్రహం నిలబడి ఉంటే ఇక్కడ కూర్చొని ఉన్నాడని, ఆయన విగ్రహం ప్రతిష్ఠించడం ఎంత ముఖ్యమో.. ఆయన ఆశయాలను కొనసాగించడం అంతే ముఖ్యమన్నారు. అంబేడ్కర్ విగ్రహం చూస్తే ఆయన ఆశయాలు గుర్తుకు రావాలని, నేటి యువత ఆయన్ని ఆదర్శంగా తీసుకోవాలన్నారు.

Similar News

News November 26, 2025

కంది: పదిలో 100% ఉత్తీర్ణత సాధించాలి: డీఈవో

image

కంది మండలం కాశీపూర్ కేజీబీవీ పాఠశాలలో జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు బుధవారం తనిఖీ చేశారు. పదవ తరగతి విద్యార్థులతో ప్రత్యేకంగా మాట్లాడి ఎలా చదువుతున్నారో అడిగి తెలుసుకున్నారు. 100% ఫలితాలు సాధించేలా ప్రత్యేకంగా కృషి చేయాలని సూచించారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించాలని పేర్కొన్నారు. ఆయన వెంట పాఠశాల ప్రత్యేక అధికారి ఉన్నారు.

News November 26, 2025

ఏలూరు: మంత్రి నాదెండ్లకు ZP ఛైర్‌పర్సన్ రిక్వెస్ట్

image

ఏలూరు రెవెన్యూ అతిథి భవనంలో జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి నాదెండ్ల మనోహర్‌ను బుధవారం జడ్పీ చైర్‌పర్సన్ గంట పద్మశ్రీ కలిశారు. ఇటీవలి భారీ వర్షాలు, తుఫాను వల్ల తీవ్రంగా దెబ్బతిన్న రహదారుల పరిస్థితిని ఆమె వివరించారు. అత్యవసర మరమ్మతు పనుల కోసం, ముఖ్యంగా పంచాయతీరాజ్ రహదారుల పునరుద్ధరణకు తగిన నిధులను వెంటనే విడుదల చేయాలని కోరుతూ మంత్రికి వినతిపత్రం అందజేశారు.

News November 26, 2025

సంగారెడ్డి: ప్రజలకు న్యాయ సహాయం అందిస్తున్నాం: జిల్లా జడ్జీ

image

ప్రజలకు వివిధ సంస్థల ద్వారా న్యాయ శాఖ అందిస్తున్నామని జిల్లా ప్రధాన న్యాయమూర్తి భవాని చంద్ర అన్నారు. సంగారెడ్డిలోని జిల్లా కోర్టులో జాతీయ న్యాయ దినోత్సవ సమావేశం బుధవారం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. జాతీయలోక్ అదాలత్, జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ ద్వారా ఉచితంగా న్యాయ సహాయాన్ని అందిస్తున్నట్లు చెప్పారు. సమావేశంలో న్యాయమూర్తులు పాల్గొన్నారు.