News February 1, 2025

సిద్దిపేటలో అంబేడ్కర్ విగ్రహవిష్కరణ

image

సిద్దిపేటలోని 3వ వార్డు రంగదాంపల్లిలో అంబేడ్కర్ విగ్రహాఆవిష్కరణ కార్యక్రమంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు పాల్గొన్నారు. అంతటా అంబేడ్కర్ విగ్రహం నిలబడి ఉంటే ఇక్కడ కూర్చొని ఉన్నాడని, ఆయన విగ్రహం ప్రతిష్ఠించడం ఎంత ముఖ్యమో.. ఆయన ఆశయాలను కొనసాగించడం అంతే ముఖ్యమన్నారు. అంబేడ్కర్ విగ్రహం చూస్తే ఆయన ఆశయాలు గుర్తుకు రావాలని, నేటి యువత ఆయన్ని ఆదర్శంగా తీసుకోవాలన్నారు.

Similar News

News February 15, 2025

మైలవరం: యూట్యూబ్ చూసి తండ్రిని చంపిన కుమారుడు

image

మైలవరం (మ) మెర్సుమల్లి శివారు ములకపెంటలో ఇటీవల కన్నతండ్రిని కుమారుడు చంపిన విషయం తెలిసిందే. పోలీసుల వివరాల మేరకు.. నిందితుడు పుల్లారావు డబ్బును షేర్ మార్కెట్‌లో పెట్టి పోగొట్టుకున్నాడు. దీంతో తండ్రి శ్రీనివాసరావును ఆస్తి అమ్మి డబ్బులు ఇవ్వమని అడిగాడు. తండ్రి ఒప్పుకోలేదని కోపంలో కర్రతో కొట్టి చంపాడు. యూట్యూబ్‌లో పలు నేర కథనాలు చూసి కర్రతో కొట్టి చంపినట్లు విచారణలో తెలిందని సీఐ చంద్రశేఖర్ చెప్పారు.

News February 15, 2025

నేటి నుంచి CBSE 10, 12వ తరగతి ఎగ్జామ్స్

image

నేటి నుంచి దేశవ్యాప్తంగా CBSE బోర్డ్ ఎగ్జామ్స్ ప్రారంభం కానున్నాయి. ఇందుకోసం 7842 సెంటర్లు ఏర్పాటు చేశారు. 24.12 లక్షల మంది 10వ, 17.88 లక్షల మంది 12వ తరగతి విద్యార్థులు ఈ పరీక్షలు రాయనున్నారు. ఉ.10.30 నుంచి మ.1.30 గం. వరకు ఎగ్జామ్స్ ఉంటాయి. అడ్మిట్ కార్డులతో పాటు స్కూల్ ఐడెంటిటీ కార్డులు తీసుకెళ్లాలి. యూనిఫాం తప్పనిసరి. మార్చి 18న టెన్త్, ఏప్రిల్ 4న 12వ తరగతి బోర్డ్ ఎగ్జామ్స్ ముగుస్తాయి.

News February 15, 2025

పర్చూరు: అధికారికి రెండేళ్ల జైలు శిక్ష

image

దేవాలయాల నిధులను సొంతానికి వాడుకున్న నూతలపాటి శివప్రసాద్ అనే అధికారికి శుక్రవారం జైలు శిక్ష పడింది. పర్చూరు, ఇంకొల్లు మండలాల్లో పనిచేసిన సమయంలో శివప్రసాద్ 4 దేవాలయాలకు సంబంధించిన రూ.88 లక్షలు దుర్వినియోగం చేశారు. ఈ కేసులను విచారించిన పర్చూరు జూనియర్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ శాంతి ముద్దాయికి ఒక్కో కేసులో రెండేళ్ల జైలు శిక్ష, రూ.70 వేల జరిమానా విధించారని ఎస్ఐలు మాల్యాద్రి, సురేశ్ చెప్పారు.

error: Content is protected !!