News August 17, 2024
సిద్దిపేటలో పొలిటికల్ వార్.. బీఆర్ఎస్ Vs కాంగ్రెస్

సిద్దిపేటలో రాజకీయం హీటెక్కింది. 2 రోజులుగా BRS, కాంగ్రెస్ మధ్య రాజకీయ రగడ సాగుతోంది. రూ.2లక్షల రుణమాఫీతో హరీశ్ రావు రాజీనామా చేయాలని పోస్టర్ల ఏర్పాటుతో శుక్రవారం రాత్రి హైడ్రామా సాగింది. MLA క్యాంప్ ఆఫీసుపై దాడిని నిరసిస్తూ నేడు BRS నేతలు నిరసన ర్యాలీ చేపట్టగా.. హరీశ్ రావు రాజీనామా చేయాలని కాంగ్రెస్ నాయకులు ర్యాలీ తీశారు. దీంతో ఉద్రిత్త పరిస్థితి నెలకొంది. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
Similar News
News December 4, 2025
వెల్దుర్తి: ఎండ్రకాయల వేటకు వెళ్లి వ్యక్తి గల్లంతు

వెల్దుర్తి హల్దీవాగులో ఎండ్రకాయ వేటకు వెళ్లి వ్యక్తి అదృశ్యమైన ఘటన హస్తాల్ పూర్ శివారులో చోటు చేసుకుంది. గ్రామంలోని గంగిరెద్దులాగా చెందిన జానపాటి సాయిలు, ఆవుల దుర్గయ్య అలియాస్ శంకర్ (42) గ్రామ శివారులోని హల్దీవాగుకి ఎండ్రకాయల వేటకు వెళ్లారు. ఇరువురు ఎండ్రకాయలు పట్టుకొని బయటకు వస్తుండగా, దుర్గయ్య నీటిలో ఒక్కసారిగా మునిగి పోయాడు. దీంతో ఎంత వెతికినా ఆచూకీ లభించలేదు.
News December 4, 2025
మెదక్ జిల్లాలో 15 సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవం

మెదక్ జిల్లాలో మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో 15 సర్పంచ్ పదవులు ఏకగ్రీవమయ్యాయి. ఇందులో పాపన్నపేట మండలంలో 6, పెద్దశంకరంపేట మండలంలో 5, టెక్మాల్ మండలంలో 3 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. హవేలీ ఘనపూర్ మండలం గాజిరెడ్డిపల్లి సర్పంచ్ స్థానం కూడా ఏకగ్రీవమైంది.