News February 19, 2025
సిద్దిపేటలో ప్రియుడితో కలిసి భర్త హత్యకు యత్నం

ప్రియుడితో కలిసి భర్త హత్యకు భార్య యత్నించింది. పోలీసుల వివరాలిలా.. సిద్దిపేటలోని గుండ్లచెరువు కాలనీ వాసికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. అతడి భార్యకు అదే కాలనీకి చెందిన శ్రవణ్‌తో వివాహేతర సంబంధం ఉంది. తమకు అడ్డుగా ఉన్న భర్త హత్యకు ప్రియుడితో కలిసి భార్య ప్లాన్ చేసింది. శ్రవణ్ తన స్నేహితులతో కలిసి 2సార్లు దాడి చేయగా భర్త ఇచ్చిన ఫిర్యాదుతో విచారించిన పోలీసులు శ్రవణ్‌ను రిమాండ్‌కు తరలించారు.
Similar News
News December 5, 2025
జిల్లాకు ‘ప్రకాశం’ అని నామకరణం చేసింది ఈ రోజే!

ఆంధ్ర రాష్ట్ర అవతరణ అనంతరం ఒంగోలు జిల్లా కాస్త ప్రకాశం జిల్లాగా మారింది నేడే. 1970లో జిల్లా ఏర్పడగా, 1972 డిసెంబర్ 5న స్వాతంత్ర్య సమరయోధులు, ఆంధ్ర రాష్ట్ర తొలి CM టంగుటూరి ప్రకాశం పంతులు పేరున జిల్లాకు నామకరణం చేశారు. నాగులుప్పలపాడు(M) వినోదరాయునిపాలెంలో జన్మించిన ప్రకాశం పంతులు స్వాతంత్ర్య ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. ఆ మహనీయుడి పేరున ఏర్పడ్డ జిల్లా వాసులుగా గర్విద్దాం.. ఆయన సేవలను కొనియాడుదాం!
News December 5, 2025
వరంగల్ కమిషనరేట్ పరిధిలో 60 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు

వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఆదివారం డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో మొత్తం 60 కేసులు నమోదయ్యాయి. ట్రాఫిక్‌లో 33, సెంట్రల్ జోన్లో 19, వెస్ట్ జోన్లో 3, ఈస్ట్ జోన్లో 2 కేసులు నమోదయ్యాయి. మద్యం తాగి వాహనం నడపడం ద్వారా జరిగే రోడ్డు ప్రమాదాల నివారణకై పోలీసులు తీసుకుంటున్న చర్యల్లో భాగంగా ఈ తనిఖీలు నిర్వహిస్తున్నారు.
News December 5, 2025
MBNR: యువకులకు ఉచిత శిక్షణ.. ఫోన్ చేయండి

ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని గ్రామీణ యువకులకు SBI, RSETI ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు ఆ సంస్థ డైరెక్టర్ జి.శ్రీనివాస్ ‘Way2News’కు తెలిపారు. బైక్ మెకానిక్, సెల్‌ఫోన్ కోర్సులలో ఈనెల 23 నుంచి ఉచిత శిక్షణ ప్రారంభం అవుతుందన్నారు. 19-45లోపు ఉండాలని, SSC MEMO, రేషన్, ఆధార్, కుల ధ్రువీకరణ పత్రం, 3 ఫొటోలతో ఈనెల 22లోగా దరఖాస్తులు చేసుకోవాలన్నారు. వివరాలకు 98481 42489 సంప్రదించాలన్నారు. #SHARE IT.


