News April 12, 2024
సిద్దిపేటలో రూ.5,70,640 నగదు సీజ్

సిద్దిపేట జిల్లాలో పోలీసులు విస్తృతంగా వాహనాల తనిఖీలు చేస్తున్నారు. ఆధారాలు లేకుండా తీసుకెళ్తున్న రూ.5,79,640 సీజ్ చేసినట్లు సిద్దిపేట సీపీ డాక్టర్ బి. అనురాధ తెలిపారు. వంటిమామిడి చెక్ పోస్టు వద్ద రూ.1,50,000, గౌరారం పోలీస్ స్టేషన్ ఎదురుగా రూ.76,640, ముస్త్యాల చెక్ పోస్టు వద్ద రూ.1,60,000, రాజగోపాలపేట పోలీస్ స్టేషన్ వద్ద రూ.1,10,000, హబ్సిపూర్ X రోడ్ వద్ద రూ. 83,000 సీజ్ చేసినట్లు చెప్పారు.
Similar News
News February 7, 2026
మెదక్: ఫిబ్రవరి 13న మున్సిపల్ ఎన్నికల లెక్కింపు

మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశామని కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. ఫిబ్రవరి 13న ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభం కానుంది. కలెక్టరేట్‌లో కౌంటింగ్ సిబ్బందికి నిర్వహించిన శిక్షణలో పోస్టల్ బ్యాలెట్, లెక్కింపు విధానంపై అవగాహన కల్పించారు. నిబంధనల మేరకు కౌంటింగ్ ప్రక్రియ పకడ్బందీగా జరుగుతుందన్నారు.
News February 7, 2026
మెదక్: జర్నలిస్టుల అక్రిడిటేషన్లకు దరఖాస్తుల ఆహ్వానం: కలెక్టర్

2026–28 కాలానికి జర్నలిస్టుల అక్రిడిటేషన్ కార్డుల జారీకి ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. ప్రస్తుతం ఉన్న కార్డుల గడువు ఫిబ్రవరి 28తో ముగియనున్న నేపథ్యంలో అర్హత గల జర్నలిస్టులు కొత్త కార్డుల కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. సమాచార పౌరసంబంధాల శాఖ ద్వారా ఈ ప్రక్రియ కొనసాగుతుందని ఆయన పేర్కొన్నారు.
News February 7, 2026
మెదక్: మున్సిపల్ బరిలో న్యాయవాది

మెదక్ మున్సిపల్ ఎన్నికల్లో యువ న్యాయవాది జీవన్ రావు పోటీ చేస్తున్నారు. 2016లో లా పట్టా అందుకున్న జీవన్ రావు ప్రస్తుతం మెదక్ కోర్టులో ప్రాక్టీస్ నిర్వహిస్తున్నారు. 2020 మున్సిపల్ ఎన్నికల్లో పట్టణంలోని 7వ వార్డు నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా జీవన్ రావు సతీమణి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఈసారి 6వ వార్డు రిజర్వేషన్ అనుకూలంగా రావడంతో బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీలో ఉన్నారు.


